Page Loader
WhatsApp: వాట్సప్‌లో 'థీమ్‌ చాట్‌' ఫీచర్‌.. చాటింగ్‌ను మీ స్టైల్‌లో మలుచుకోవచ్చు 
వాట్సప్‌లో 'థీమ్‌ చాట్‌' ఫీచర్‌.. చాటింగ్‌ను మీ స్టైల్‌లో మలుచుకోవచ్చు

WhatsApp: వాట్సప్‌లో 'థీమ్‌ చాట్‌' ఫీచర్‌.. చాటింగ్‌ను మీ స్టైల్‌లో మలుచుకోవచ్చు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా బీటా యూజర్ల కోసం త్వరలోనే ఓ ప్రత్యేకమైన ఫీచర్‌‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే 'థీమ్‌ చాట్‌' ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. వాట్సప్‌ కొత్త ఫీచర్‌ సాయంతో యూజర్లు అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు జోడించొచ్చు. వాటికి నచ్చిన రంగులతో నింపొచ్చు. అంటే ఇకపై వినియోగదారులకు నచ్చిన విధంగా చాట్‌పేజ్‌‌ను రూపొందించుకొనే అవకాశం ఉంటుంది.

Details

టెస్టింట్ దశలో 'థీమ్ చాట్'

యూజర్ల అనుభవాన్ని మెరుగపరచడమే కాకుండా చాటింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్ ఈ సదుపాయాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే 'వాబీటా ఇన్ఫో' తన బ్లాగ్‌లో పంచుకుంది. సాధారణంగా ఇన్‌స్టాలో స్టోరీ పెట్టే సమయంలో నచ్చిన వ్యక్తులను '@' సాయంతో ట్యాగ్‌ చేస్తుంటాం. అంటే సదరు వ్యక్తికి మనం స్టోరీ పెట్టినట్లు నోటిఫికేషన్‌ అందుతుంది. దీంతో వాళ్లు మన స్టోరీని చూస్తారు. అచ్చం అలాంటి సదుపాయాన్నే వాట్సప్‌ కూడా తీసుకురావాలని చూస్తోంది. వినియోగదారుల గోప్యతకు భంగం కలగకుండా ఈ ఫీచర్‌ను తీసుకరానున్నారు.