
Windows 11: విండోస్ 11లో కొత్త ఫీచర్.. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాల ఫిల్టర్‌ను ఆఫ్ చేసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 11కు మరో కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. వాయిస్ టైపింగ్‌లో అసభ్య పదాలను ఫిల్టర్ చేసే ఆప్షన్‌ను ఇప్పుడు యూజర్లు స్వతంత్రంగా ఆఫ్ చేయడానికి అవకాశం లభించనుంది.
డెవ్, బీటా ఛానళ్లలో ఉన్న విండోస్ ఇన్సైడర్స్‌కు మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ కోసం అందించింది.
వాయిస్ టైపింగ్ సెట్టింగ్స్‌లో కొత్త టాగిల్ ఆప్షన్ ద్వారా యూజర్లు అసభ్య పదాలను ఫిల్టర్ చేయాలా, లేక వారి మాట్లాడినట్టే ట్రాన్స్‌క్రైబ్ చేయాలా అని నిర్ణయించుకోగలిగే అవకాశం ఉంటుంది.
Details
'Click to Do' ఫీచర్‌ను కూడా పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్
ప్రొఫానిటీ ఫిల్టర్ టాగిల్‌తో పాటు, సర్ఫేస్ పెన్ యూజర్ల కోసం 'Click to Do' అనే మరో కొత్త ఫీచర్‌ను కూడా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్ లేదా ఇమేజ్‌పై స్టైలస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ప్రత్యేక యాక్షన్లను అసైన్ చేయవచ్చు.
ఇందులో టెక్స్ట్‌ను సమరీ చేయడం, ఫోటో నుండి వస్తువులను త్వరగా తొలగించడం వంటి పనులు ఉన్నాయి. ఈ ఫీచర్‌ను కూడా విండోస్ ఇన్సైడర్స్ కోసం విడుదల చేశారు.
Details
Copilot+ PCsకు ప్రత్యేకంగా Recall ఫీచర్ లాంచ్
మరొక విశేషం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ ఇటీవలే 'Recall' అనే ఫీచర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా Copilot+ PCsకు మాత్రమే అందుబాటులో ఉంది.
Recall ఫీచర్ ద్వారా యూజర్లు కంప్యూటర్లో చేసుకున్న ప్రతి చర్యను స్క్రీన్‌షాట్ల రూపంలో సజావుగా రికార్డ్ చేసి, సెర్చ్ చేయగలుగుతారు.
ఒకట్రెండు నెలల క్రితం జరిగిన కార్యకలాపాలను కూడా సులభంగా వెతికే అవకాశం ఈ ఫీచర్ ద్వారా లభిస్తుంది.