Page Loader
గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్స్.. ఇక ఆ సమస్యకు చెక్!
గూగుల్ మ్యాప్ లో సరికొత్త ఫీచర్స్

గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్స్.. ఇక ఆ సమస్యకు చెక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2023
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ మ్యాప్ వినియోగదారుల ట్రావెల్ ప్లాన్ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లాన్సబుల్ డైరక్షన్స్, రీసెంట్ ఫీచర్, ఇమెర్సివ్ వ్యూ పేరుతో మూడు ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో గ్లాన్సబుల్ డైరక్షన్స్ ముఖ్యమైంది. దీంతో లాక్ స్క్రీన్‌పై, రూట్ ఓవర్ వ్యూపై కూడా ట్రావెల్ ప్రొగ్రెస్‌ను తెలుసుకొనే అస్కారం ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఏనేబుల్ చేసుకొని గమ్యస్థానానికి చేరే మార్గాలను చూపమని రిక్వెస్ట్ చేస్తే ట్రిప్ ప్రొగ్రెస్‌ను, ముందు వచ్చే టర్నింగ్స్ గురించి ముందుగానే తెలియజేస్తుంది. గతంలో ఈ ఫీచర్ ఫుల్ నేవిగేషన్ మోడల్‌లో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉండేంది. త్వరలో ఈ ఫీచర్‌ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Details

ఇమెర్సిన్ వ్యూ ఫీచర్ తో ఎన్నో ప్రయోజనాలు

యూజర్లకు ట్రావెల్ వివరాలను తెలపడానికి రీసెంట్స్ ఫీచర్ కూడా అప్‌డేట్ చేశారు. ఈ ఫీచర్ తో గూగుల్ మాప్స్ ఇటీవల వెళ్లిన అన్ని ముఖ్యమైన ప్రదేశాలను భద్రపరుస్తుంది. ఈ ఫీచర్ గతంలో ఉన్నా తాజా అప్‌డేట్ వల్ల గూగుల్ మ్యాప్స్ విండోను క్లోజ్ చేసినప్పటికీ యూజర్ వెళ్లిన ప్రాంతాలను అటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. ఇమెర్సిన్ వ్యూ ఫీచర్తో గూగుల్ మ్యాప్స్ లో నగరాలకు మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలను యాడ్ చేశారు. వరల్డ్ వైడ్‌గా సుమారు 500లకు పైగా పర్యాటక ప్రదేశాలు, ల్యాండ్ మార్క్స్ కు ఈ ఇమెర్సివ్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పర్యాటక ప్రదేశంలో వేదిలా ఫోటోలను కృత్రిమ మేథ సాంకేతికతతో కంబైన్ చేసి 3డీలో చూసేలా అవకాశం కల్పించారు.