LOADING...
WhatsApp: మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు.. సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!
మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు.. సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!

WhatsApp: మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు.. సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. 'సిమ్ బైండింగ్' నిబంధనలను అమలు చేయడానికి నిర్ణయించిన ఫిబ్రవరి 28 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఫోన్‌లో సిమ్ కార్డ్ లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్ చాట్, షేర్ చాట్, జియో చాట్, జోష్ వంటి మెసేజింగ్ యాప్‌లు పనిచేయవు. కంప్యూటర్‌లో వాట్సాప్‌లో లాగిన్ అయిన వినియోగదారులు ఆరు గంటలలోపు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతారు. ఈ చర్యల ద్వారా సైబర్ మోసగాళ్లను గుర్తించడం సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

Details

సిమ్ బైండింగ్ అంటే ఏమిటి?

సిమ్ బైండింగ్ అనేది మీ మెసేజింగ్ యాప్ ఖాతాను మీ భౌతిక సిమ్ కార్డ్‌తో అనుసంధానం చేసే భద్రతా విధానం. అంటే, మీ రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ మీ ఫోన్‌లో ఉన్నప్పుడే ఆ యాప్ పనిచేస్తుంది. హ్యాకర్లు లేదా సైబర్ నేరగాళ్లు మీ నంబర్‌ను వేరే హ్యాండ్‌సెట్‌లో ఉపయోగించడం ఈ విధానం ద్వారా నిరోధించవచ్చని ప్రభుత్వం వివరించింది. నివేదికల ప్రకారం, మార్చి 1 నుంచి ఒక వినియోగదారు మెసేజింగ్ యాప్‌ను సిమ్ కార్డ్‌కు లింక్ చేసిన తర్వాత, ఆ యాప్ రిజిస్టర్డ్ సిమ్ ఉన్న ఫోన్‌లో మాత్రమే ఓపెన్ అవుతుంది.

Details

లాగిన్ కావాలంటే సిమ్ కార్డు తప్పనిసరి

ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసేస్తే యాప్ వెంటనే పనిచేయడం ఆగిపోతుంది. అంటే పై పేర్కొన్న యాప్‌లలో లాగిన్ కావాలంటే సిమ్ కార్డ్ తప్పనిసరిగా ఫోన్‌లో ఉండాలి. అదేవిధంగా వాట్సాప్ వెబ్ వంటి డెస్క్‌టాప్ లాగిన్‌లపై కూడా పరిమితులు విధించారు. ఆరు గంటల తర్వాత ఆటో లాగ్ అవుట్ అవుతుంది. ఈ చర్యలతో మోసపూరిత లాగిన్‌లు, ఖాతా దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

Advertisement