LOADING...
Formation Of The Moon: భూమిని పుట్టించిన థియా… చివరికి భూమిలోనే లీనమైందా?
భూమిని పుట్టించిన థియా… చివరికి భూమిలోనే లీనమైందా?

Formation Of The Moon: భూమిని పుట్టించిన థియా… చివరికి భూమిలోనే లీనమైందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భూమి, చంద్రుడు ఎలా పుట్టాయన్న ప్రశ్నకు ఇప్పటివరకు మనం చదివిన వివరణ ఒక మహా అంతరిక్ష సంభవం చుట్టూ తిరుగుతుంది. సుమారు 4.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం, ప్రోటో ఎర్త్‌ (భూమి ఏర్పడే ముందు ఉన్న గ్రహం), థియా (Theia) అనే మరో పెద్ద గ్రహం ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్టుగా శాస్త్రవేత్తలు భావించారు. అయితే, ఢీకొన్న అనంతరం చంద్రుడు, ప్రస్తుత భూమి రూపుదిద్దుకున్నప్పటికీ, అంగారకుడి పరిమాణం ఉన్న థియా ఎక్కడికి పోయిందన్న ప్రశ్నకు ఇంతకాలం స్పష్టమైన సమాధానం లేదు.

వివరాలు 

ప్రోటో ఎర్త్‌తో ఢీకొన్న తర్వాత చంద్రుడు ఏర్పడాడు 

కానీ ఇటీవల, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోలార్ సిస్టమ్ రిసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో శాస్త్రవేత్తలు ఈ విషయంపై ఒక కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. వారి పరిశోధనల ప్రకారం, ప్రోటో ఎర్త్‌తో ఢీకొన్న తర్వాత చంద్రుడు ఏర్పడగా, థియా పూర్తిగా నశించకుండా భూమిలోనే కలిసిపోయిందనే అభిప్రాయానికి వారు వచ్చారు. భూమి గర్భంలోనూ, చంద్రుడి అంతర్భాగంలోనూ లభించిన ఐసోటోప్‌లను విశ్లేషించినప్పుడు ఈ ఆధారాలు బయటపడ్డాయని వారు పేర్కొన్నారు. అంటే, చంద్రుడి పుట్టుకకు కారకమైన థియాచే.. చివరికి భూమిలో లీనమై తన ఉనికిని ముగించుకుందన్న మాట. ఈ సిద్ధాంతాన్ని ఇంకా బలపర్చేందుకు అదనపు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.