New York AI Toys Ban: ఏఐ టాయ్స్‌పై న్యూయార్క్ సంచలన నిర్ణయం .. ఐదేళ్లపాటు బ్యాన్
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లలతో మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మలపై న్యూయార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌లతో పనిచేసే బొమ్మల తయారీ, విక్రయాలను ఐదేళ్లపాటు నిషేధిస్తూ గవర్నర్ కాథీ హోకుల్ చట్టంపై సంతకం చేశారు. ఇంటర్నెట్ ద్వారా పిల్లలతో సంభాషించే టాకింగ్ టెడ్డీలు, డాల్స్, రోబోట్లు ఈ నిషేధం పరిధిలోకి వస్తాయి. పిల్లలు ఆడుకునే బొమ్మల రూపంలోనే ప్రమాదకరమైన సంభాషణలు జరగడం, వారి వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Details
బొమ్మల్లో ఊహించని సంభాషణలు
ఇటీవల NBC News నిర్వహించిన అధ్యయనం ఈ సమస్య తీవ్రతను బయటపెట్టింది.
మూడేళ్ల చిన్నారుల కోసం రూపొందించిన 'Pixie Paw' అనే ఏఐ బొమ్మ ఫైరింగ్ స్క్వాడ్లు, సామూహిక హత్యల వంటి విషయాల గురించి సమాచారం పంచుకున్నట్లు వెల్లడైంది.
మరో 'Pixie Paw Smart Interactive Plush Cat' ఏకంగా అత్యంత అభ్యంతరకరమైన లైంగిక అంశాల గురించి వివరించినట్లు పరిశోధనలో తేలింది.
పిల్లల కోసం తయారు చేసిన బొమ్మలు ఇలాంటి విషయాలు మాట్లాడటం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
Details
పేరెంటల్ కంట్రోల్స్ కూడా అంతంతే
US PIRG Education Fund విడుదల చేసిన 'Trouble in Toyland' నివేదికలోనూ ఇదే తరహా ప్రమాదాలను ప్రస్తావించారు.
మూడేళ్ల పిల్లల కోసం మార్కెట్ చేసిన కొన్ని ఏఐ టాయ్స్ లైంగిక అంశాల గురించి మాట్లాడటమే కాకుండా, ఇంట్లో అగ్గిపుల్లలు ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పినట్లు నివేదిక పేర్కొంది.
కొన్ని బొమ్మల్లో తల్లిదండ్రుల నియంత్రణ వ్యవస్థలు చాలా పరిమితంగా ఉండగా, కాలక్రమంలో వాటి భద్రతా పరిమితులు మరింత బలహీనపడినట్లు వెల్లడైంది.
Details
పిల్లల భద్రతకే ప్రాధాన్యం
ఈ నిషేధానికి న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ కూడా మద్దతు తెలిపారు.
పిల్లల బొమ్మల్లోని ఏఐ చాట్‌బాట్‌లు అనుచిత కంటెంట్‌ను పిల్లల ముందుకు తీసుకువస్తూ వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
స్టేట్ సెనేటర్ ఆండ్రూ గౌనార్డెస్, 'Mothers Against Media Addiction'కు చెందిన లావిటా టఫ్ కూడా మరింత కఠినమైన నిబంధనలు కోరుతున్నారు.
ఏఐ ఉన్న బొమ్మలను మార్కెట్‌లోకి తీసుకురావాలంటే అవి మొదటి నుంచే భద్రతతో రూపొందించాలని వారు స్పష్టం చేస్తున్నారు.