LOADING...
NISAR: అంతరిక్షంలో ఏమిటీ 'నైసర్‌'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ..? 
అంతరిక్షంలో ఏమిటీ 'నైసర్‌'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ..?

NISAR: అంతరిక్షంలో ఏమిటీ 'నైసర్‌'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష రంగంలో భారత్‌ మరో కీలక ముందడుగు వేయనుంది. ఈ రోజు సాయంత్రం శ్రీహరికోట శార్‌ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-16 (GSLV-16) రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం ద్వారా 'నైసర్‌' అనే అధునాతన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించనున్నారు. ఇది భూ ఉపరితల పరిశీలనలో భారతదేశాన్ని కీలక మైలురాయికి చేరుస్తుంది.

వివరాలు 

ఇస్రో-నాసా సంయుక్త ఉపగ్రహం 

నైసర్‌ అనే ఈ శాటిలైట్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) కలిసి అభివృద్ధి చేశాయి. దీన్ని NASA-ISRO Synthetic Aperture Radar (NISAR)గా పిలుస్తారు. ఇది ఇప్పటివరకు అంతరిక్షంలోకి పంపిన అత్యంత శక్తివంతమైన భూ పరిశీలన శాటిలైట్లలో ఒకటిగా నిలవనుంది. భూ అధ్యయనాల్లో ఇది కొత్త అధ్యాయానికి తెరలేపనుంది. ఈ శాటిలైట్‌కు ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో రెండు Synthetic Aperture Radar (SAR) వ్యవస్థలు అమర్చబడ్డాయి. ఇది ఈ తరహాలో రూపొందించిన మొట్టమొదటి శాటిలైట్‌. అలాగే ఇది అత్యంత ఖరీదైన శాటిలైట్లలో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది.

వివరాలు 

నైసర్‌ ప్రత్యేకతలు 

నైసర్‌లో ఉండే రెండు రాడార్లు పెద్ద డిష్‌ ఆకారంలో ఉంటాయి. ఇవి మైక్రోవేవ్‌, రేడియో తరంగాలను భూమిపైనికి పంపించి, తిరిగివచ్చిన సంకేతాల ద్వారా భూ ఉపరితల చిత్రాలను సృష్టిస్తాయి. ఈ యాంటెన్నా పరిమాణం సుమారు 12 చదరపు మీటర్లు ఉంటుంది. దీన్ని మడతపెట్టి అంతరిక్షంలోకి పంపుతారు. ఇది భూమిపై సుమారు 20 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఒక్కసారిగా చిత్రీకరించగలదు. ఇస్రో గతంలో RISAT శ్రేణిలో SAR రాడార్‌తో కూడిన శాటిలైట్లు ప్రయోగించింది కానీ, రెండు SAR వ్యవస్థలతో నైసర్‌ మైత్రి ప్రమాణంగా నిలుస్తుంది.

వివరాలు 

రాడార్‌ విధానాలు: 

నైసర్‌లో రెండు రకాల SAR రాడార్లు ఉన్నాయి: ఒకటి L-Band ఫ్రీక్వెన్సీ, మరొకటి S-Band ఫ్రీక్వెన్సీ. నైసర్‌కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్‌-బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ, మరొకటి ఎస్‌-బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీల్లో పనిచేస్తాయి. ఒకే ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేర్వేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. వీటి ప్రయోజనం ఏమిటంటే - పగలు, రాత్రి అని తేడా లేకుండా... వర్షం, మేఘాలు, పొగమంచు వంటి ఆటంకాల మధ్య కూడా స్పష్టమైన చిత్రాలను అందించగలవు. ఈ రాడార్ల సాయంతో అగ్నిపర్వతాల్లో, భూకంప మార్పుల్లో జరిగే చిన్నచిన్న మార్పుల్ని కూడా గుర్తించవచ్చు.

వివరాలు 

రాడార్‌ ప్రాముఖ్యత: 

L-Band రాడార్: దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అరణ్యాలు, ఎడారులు, మంచు ఖండాల వంటి కఠిన వాతావరణాల్లోనూ భూమి ఉపరితలాన్ని స్పష్టంగా అధ్యయనం చేయవచ్చు. S-Band రాడార్: తక్కువ ఫ్రీక్వెన్సీ గల దీని సాయంతో పంట పొలాలు, నీటి వనరులు వంటి వివరాలను మంచి స్పష్టతతో చిత్రీకరించవచ్చు. అధిక సామర్థ్యం - డేటా ఉత్పత్తి నైసర్‌ రోజుకు 80 టెరాబైట్ల డేటా ఉత్పత్తి చేయగలదు. ఇంతవరకు ఎవరూ పంపిన శాటిలైట్లు ఇంత పరిమాణంలో డేటాను ఇవ్వలేదు. ఈ డేటా క్లౌడ్‌ స్టోరేజ్‌లో భద్రపరచి, విశ్లేషణకు పంపిణీ చేస్తారు. ప్రతి 12 రోజులకు రెండు సార్లు ఈ శాటిలైట్‌ భూమి మొత్తాన్ని కవరేజ్‌ చేస్తుంది.

వివరాలు 

భారత్-అమెరికా అంతరిక్ష సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయి 

ఇస్రో-నాసా సంయుక్తంగా రూపొందించిన మొట్టమొదటి ఉపగ్రహం నైసర్‌. ఇది రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారానికి ప్రాధమిక స్థూపంలా నిలుస్తోంది. ఇప్పటికే యాక్సిమ్‌ మిషన్‌ కింద భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన సందర్భం తెలిసిందే. నైసర్‌ ద్వారా భవిష్యత్‌లో వర్షాలు, హరికేన్లు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు వంటి వాటిని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పంటల పై ప్రభావం, భూస్కలనాలు వంటి అంశాలను కూడా గమనించి ముందస్తు సూచనలు ఇవ్వగలగడం దీని విశిష్టత. నాసా వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఉపగ్రహం అందించే సమాచారం ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

వివరాలు 

ఖర్చు వివరాలు 

నైసర్‌ తయారీకి నాసా $1.16 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా, భారత్‌ వైపు నుంచి $90 మిలియన్‌ డాలర్లు వెచ్చించింది.