LOADING...
Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో ప్రకటనలు.. కొత్త ఫీచర్లపై స్పష్టత ఇచ్చిన సంస్థ!
ఇకపై వాట్సప్‌లో ప్రకటనలు.. కొత్త ఫీచర్లపై స్పష్టత ఇచ్చిన సంస్థ!

Whatsapp ads: ఇకపై వాట్సప్‌లో ప్రకటనలు.. కొత్త ఫీచర్లపై స్పష్టత ఇచ్చిన సంస్థ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల యూజర్లను కలిగి ఉన్న మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్ (WhatsApp) ఇకపై తన యాప్‌లో ప్రకటనల కోసం దారులు తీస్తోంది. ఇప్పటివరకు యాడ్‌ఫ్రీ మెసేజింగ్ అనుభూతిని కల్పించిన ఈ ప్లాట్‌ఫార్మ్‌... ఆదాయ వనరుల కోసం తాజా మార్గాన్ని ఎంచుకుంది. వాట్సప్‌ తన అధికారిక బ్లాగ్‌ పోస్టులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇకపై యాప్‌లోని 'అప్‌డేట్స్' ట్యాబ్‌ ద్వారా యాడ్స్‌ చూపించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్యాబ్‌లో ఛానెళ్లు, స్టేటస్‌లు ఉంటే... ఇకపై వీటిలో ప్రకటనల‌కు సంబంధించిన ఫీచర్లు కనిపించనున్నాయి.

Details

వాట్సప్‌లో రాబోతున్న మూడు ప్రధాన యాడ్‌ ఫీచర్లు

1. ఛానెల్‌ సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లు నెలవారీ ఫీజు చెల్లించి, తమకు ఇష్టమైన ఛానెళ్లకు మద్దతు ఇవ్వవచ్చు. ఇది ఛానెల్‌ అడ్మిన్లకు ఆర్థిక ప్రోత్సాహాన్ని కలిగించనుంది. 2. ప్రమోటెడ్ ఛానెల్స్‌ ప్రస్తుతం 'ఎక్స్‌ప్లోర్‌' సెక్షన్‌లో ట్రెండింగ్ ఛానెళ్లను చూడొచ్చు. ఇకపై ఛానెల్‌ యాజమానులు కొంత ఫీజు చెల్లించి తమ ఛానెల్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం పొందతారు. 3. స్టేటస్‌లో యాడ్స్‌ ఇప్పటి వరకు వ్యక్తుల స్టేటస్‌లే దర్శనమయ్యాయి. కానీ ఇకపై బిజినెస్ సంబంధిత స్టేటస్‌లు, బ్రాండెడ్ కంటెంట్ కూడా కనిపించనున్నాయి.

Details

 యాడ్స్‌ ఎక్కడ కనిపిస్తాయి? 

వాట్సప్‌ స్పష్టంగా చెప్పిన ప్రకారం, యాడ్స్‌ కేవలం 'అప్‌డేట్స్' ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయి. పర్సనల్‌ చాట్స్‌, మెసేజులు, కాల్స్‌ యధాతధంగా యాడ్‌ఫ్రీగానే కొనసాగుతాయి. అలాగే ఎప్పటిలాగే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కొనసాగుతుంది. అంటే, యూజర్‌ గోప్యతకు ఎలాంటి భంగం రాదు. వినియోగదారుల డేటా ఎలా ఉపయోగిస్తారు? వాట్సప్‌ ప్రకారం, యాడ్స్‌ కోసం యూజర్ల దేశం, నగరం, భాష వంటి వివరాలను మాత్రమే ఉపయోగించనున్నారు. అలాగే యూజర్ల ఫోన్ నంబర్లను ఏదైనా ప్రకటన సంస్థలకు విక్రయించం లేదా పంచుకోం అని వాట్సప్‌ స్పష్టం చేసింది. ఈ ప్రకటనల ఫీచర్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో మాత్రం వాట్సప్‌ వెల్లడించలేదు. ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉందని, త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముందని టెక్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.