Pankaj Chaudhary: భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నియంత్రించే ప్రతిపాదన ఏదీ లేదు: పంకజ్ చౌదరి
దేశంలోని క్రిప్టో-సంబంధిత సంస్థలు తమ వ్యాపారాన్ని సురక్షితమైన,చట్టబద్ధమైన పద్ధతిలో వృద్ధి చేసుకునేందుకు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే, ఈ విభాగాన్ని నియంత్రించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. యూరోపియన్ యూనియన్ (EU), UAE క్రిప్టో సెగ్మెంట్ కోసం నియమాలను రూపొందించాయి. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానంలో, సమీప భవిష్యత్తులో వర్చువల్ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలను నియంత్రించడానికి చట్టాన్ని రూపొందించే ప్రతిపాదన లేదని చెప్పారు. ఈ సెగ్మెంట్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఎంపీ జిఎం హరీష్ బాలయోగి ప్రశ్నలు సంధించారు. క్రిప్టో సెగ్మెంట్‌ను నియంత్రించేందుకు నిబంధనలను తీసుకురావడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని ఆయన అడిగారు.
క్రిప్టో-సంబంధిత చట్టాన్ని రూపొందించే లక్ష్యంతో భారతదేశం IMF,FSB తో కలిసి పనిచేసింది
చౌదరి స్పందిస్తూ, "వర్చువల్ డిజిటల్ ఆస్తుల కొనుగోలు, విక్రయాలను నియంత్రించడానికి చట్టాన్ని తీసుకురావడానికి ఎటువంటి ప్రతిపాదన లేదు. అయితే, మనీలాండరింగ్ నిరోధకం వంటి ప్రత్యేక పర్యవేక్షణ కోసం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) అధికారం ఉంది"అని తెలిపారు. గత సంవత్సరం G20 అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, G20 గ్రూప్‌లోని సభ్యులందరికీ క్రిప్టో-సంబంధిత చట్టాన్ని రూపొందించే లక్ష్యంతో భారతదేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (FSB)తో కలిసి పనిచేసింది. అన్ని G20 దేశాలు తమ సొంతంగా క్రిప్టో ప్రయోజనాలు, అప్రయోజనాలను విశ్లేషిస్తున్నాయని చౌదరి చెప్పారు.
క్రిప్టో లావాదేవీలపై పన్నుఒక శాతం తగ్గించాలని అభ్యర్ధన
క్రిప్టో విభాగం పట్ల ప్రభుత్వం కఠినమైన వైఖరి చెక్కుచెదరకుండా ఉంది.ఈఏడాది బడ్జెట్‌లో పన్ను మినహాయింపు లేకపోవడంతో క్రిప్టో సంబంధిత సంస్థలు షాక్‌కు గురయ్యాయి. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రంగాలకు సంస్కరణలు ప్రకటించారు. అయితే,క్రిప్టో సెగ్మెంట్ లేదా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి ప్రస్తావించలేదు.క్రిప్టో-సంబంధిత సంస్థలు క్రిప్టో లావాదేవీలపై మూలం వద్ద మినహాయించబడిన పన్ను(TDS)ని ఒక శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్నిఅభ్యర్థించాయి. భారత్ వెబ్3 అసోసియేషన్ Gadgets360తో మాట్లాడుతూ,"యూజర్ల ట్రేడింగ్,లావాదేవీలలో తగ్గుదలకి సంబంధించి మేము ఒక విశ్లేషణ ఇచ్చాము.పన్నుల నిర్మాణంలో మార్పు ప్రభుత్వ ఆదాయాన్ని ఎలా పెంచుతుందో కూడా మేము చెప్పాము.మేము దానిని చేయడానికి ప్రయత్నిస్తున్నాము. పన్నుల సమతూకం దాని కోసం ఒత్తిడిని కొనసాగిస్తుంది" అని తెలిపారు.