NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Nobel Prize for Indians: నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు వీరే
    తదుపరి వార్తా కథనం
    Nobel Prize for Indians: నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు వీరే
    నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు వీరే

    Nobel Prize for Indians: నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు వీరే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 07, 2024
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం, 1901 నుండి నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు.

    భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, ప్రపంచ శాంతి కృషి చేసిన వారికి ఈ బహుమతులు అందించబడ్డాయి.

    1895లో ఆయన తన వీలునామాలో, ఈ రంగాల్లో ప్రత్యేక సేవలు అందించిన వ్యక్తులకు నోబెల్ బహుమతులు ఇవ్వాలని రాశారు.

    ఈ బహుమతులను ప్రతి సంవత్సరము ప్రకటించబడుతాయి. నాలుగు రంగాల్లో ఇచ్చే ఆరు బహుమతులను ప్రతి ఏడాది నోబెల్ వర్ధంతి, అంటే డిసెంబర్ 10న, స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో అందజేస్తారు.

    దీని కింద అందించే నగదు ప్రతి సంవత్సరము మారుతూ ఉంటుంది. ఒక సంవత్సరంలో ఇవ్వని పారితోషకాన్ని తదుపరి ఏడాదికి బదిలీ చేయవచ్చు.

    వివరాలు 

    రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, సాహిత్యం) 

    ఈ నేపథ్యంలో, నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

    రవీంద్రనాథ్ ఠాగూర్: భారతదేశానికి జాతీయగీతమైన 'జనగణమన'ని అందించడమే కాకుండా, బంగ్లాదేశ్‌కు కూడా జాతీయగీతాన్ని రాసిన ప్రముఖ రచయిత రవీంద్రనాథ్‌ ఠాకుర్‌. ఆయన ఆంగ్లభాషలోని సాహిత్యాన్ని పాశ్చాత్యులకు మాత్రమే కాకుండా, ప్రపంచానికి అందించిన వారిని గుర్తించిన నోబెల్ కమిటీ, ఆయన రచన 'గీతాంజలి'కి ఉన్న "అత్యంత సున్నితమైన, అందమైన, కవితాత్మక భావాలతో అభివ్యక్తీకరించడాన్ని" అభినందించింది. 1913లో, సాహిత్య రంగంలో తొలి నోబెల్ బహుమతిని పొందిన ఆయన, ఆర్థిక పరమైన గొప్పతనం, సాహిత్య ప్రతిభకు ప్రతీకగా నిలిచారు.

    వివరాలు 

    కాంతిపుంజంలా దూసుకొచ్చిన రామన్‌

    కాంతి ధర్మాన్ని ఒడిసిపట్టినందుకు నోబెల్ పురస్కారం అందుకున్నారు సీవీ రామన్ . కాంతి ప్రయాణంలో ఒక అణువు వద్ద ఫోటాన్‌లు ఎంత మేరకు పరివ్యాప్తమవుతాయన్న దానిపై ఆధారపడి, ఆయా పదార్థాల లక్షణాలను అర్థం చేసుకోవచ్చు అని రామన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన భౌతిక శాస్త్రంలో కొత్త మార్గాలను తెరిచింది. "రామన్ ఎఫెక్ట్" పేరుతో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆధునిక లేజర్ల నుండి రేడియేషన్ వినియోగం వరకు, ఈ దృష్టికోణం అనేక సందర్భాలలో ముఖ్యమైన పాత్ర పోషించింది. సైన్స్ రంగంలో నోబెల్ పురస్కారం గెలిచిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి సీవీ రామన్.

    వివరాలు 

    హరగోవింద ఖొరానా (1968, వైద్యరంగం) 

    జన్యువుల ఆవిష్కారాన్ని అమోఘంగా భావించిన హరగోవింద ఖొరానా, ఆ జన్యువుల్లో జీవ సంకేతాలు ఎలా ఉంటాయో విశ్లేషించి, కీలకమైన ప్రొటీన్ సమ్మేళనాలు, వాటి పాత్రను గుర్తించడం ద్వారా వైద్య రంగంలో నోబెల్ అవార్డు పొందారు. జీవులలో జన్యుపరమైన జీవభాష మూడు మూడు న్యూక్లియోటైడ్‌ల సమ్మేళనంగా ఉంటుందని నిరూపించడం ద్వారా కృత్రిమ జన్యువుల రూపకల్పనకు, అలాగే జన్యు పరిశోధనలకు ఒక దారిని నిర్దేశించారు. 2011 నవంబర్ 11న ఆయన మరణించారు.

    వివరాలు 

    మదర్‌థెరిసా (1979, శాంతి బహుమతి) 

    అల్బేనియాలో జన్మించిన మదర్ థెరిసా భారతదేశాన్ని తన సేవాకేంద్రంగా ఎంచుకుంది. పేదలు, రోగులకు ప్రేమతో సేవలు అందించి, ప్రపంచ శాంతిని పెంచడంలో ఆమెకు నోబెల్ కమిటీ గౌరవం అందించింది. ఆమె ప్రపంచవ్యాప్తంగా సొసైటీ ఆఫ్ మిషనరీస్‌ను స్థాపించి, ప్రకృతి విపత్తుల వల్ల ప్రభావితమైన మానవాళి పునరావాసానికి అనిర్వచనీయమైన సేవలు అందించింది. వ్యసనంతో బాధపడే వ్యక్తులు నుంచి ఎయిడ్స్ బాధితుల వరకూ, సకల మానవాళికి ఆమె తోడుగా నిలిచింది.

    వివరాలు 

    సుబ్రమణ్యం చంద్రశేఖర్ (1983, భౌతికశాస్త్రం) 

    నక్షత్రాల పుట్టుక,పరిణామాలపై కొత్త కాంతిని ప్రసరించినందుకు సుబ్రమణ్యం చంద్రశేఖర్‌కు నోబెల్ బహుమతి లభించింది.

    సీవీ రామన్ సోదరుడి కుమారుడైన చంద్రశేఖర్ ఖగోళ భౌతికశాస్త్రంలో ప్రసిద్ధి చెందిన చంద్రశేఖర్ లిమిట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

    ఆయన ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం, ఒక నక్షత్రం ఎంత ద్రవ్యరాశిని కోల్పోతే అది కృష్ణ బిలంలో విలీనమవుతుందో ఆ పరిమితిని లెక్కించడం ఆయన చేసిన ఒక ముఖ్యమైన పర్యవేక్షణ. నాసా ఒక అబ్జర్వేటరీకి ఆయన పేరు పెట్టింది.

    వివరాలు 

    అమర్త్యసేన్ (1998, అర్థశాస్త్రం) 

    సంప్రదాయ అర్థశాస్త్రం తరతరాలుగా ఉపేక్షించబడ్డ జన సంక్షేమంపై అందరి దృష్టిని మళ్లించడానికి అమర్త్యసేన్ చేసిన కృషి గొప్పది.

    వ్యక్తి సంక్షేమాన్ని కేంద్రీకరించడం కంటే సామాజిక సంక్షేమం ఎంత ముఖ్యమో పునఃఛేదిస్తూ, సమాజాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చేసిన సూచనలు, ఆధునిక కాలంలో అభివృద్ధి దిశను మార్చడం ద్వారా ఐరాసలో కూడా అమర్త్యసేన్ ప్రభావాన్ని చూపించారు.

    ఆర్థిక సంస్కరణలకు ముందు విద్య, వైద్యం, ఆహార లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, అలాగే అవి సరైన స్థితిలో ఉంటేనే నిజమైన ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలను నొక్కి చెప్పడం అమర్త్యసేన్ ముఖ్యమైన లక్షణం.

    వివరాలు 

    వెంకట్రామన్ రామకృష్ణన్ (2009, రసాయనశాస్త్రం) 

    అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు వెంకట్రామన్ రామకృష్ణన్‌కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.

    ఈ బహుమతి, అమెరికా శాస్త్రవేత్త థామస్ ఇ. స్టీజ్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఆడా ఇ. యోనాథ్‌తో కలిసి పంచుకున్నారు.

    కణంలోని రైబోజోమ్ అత్యంత సూక్ష్మ స్థాయిలో రూబందాన్ని ఎలా చూడగలరో, రైబోజోమ్ డీఎన్‌ఏ పోగులను ప్రోటీన్లుగా ఎలా మారుస్తుందనే అంశాలను ఈయన ఆవిష్కరించారు.

    వివరాలు 

    రాజేంద్ర కె.పచౌరీ (2007, శాంతి) 

    భూతాపంపై ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) నివేదిక తయారీలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు రాజేంద్ర కె. పచౌరీకి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఈ బహుమతిని ఆయన ఆల్‌గోర్‌తో కలిసి స్వీకరించారు.

    వివరాలు 

    కైలాస్ సత్యార్థి (2014, శాంతి) 

    కైలాష్ సత్యార్థి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, బాలల హక్కుల కోసం 30 సంవత్సరాల కాలంగా పోరాడుతూ, "బచ్‌పన్ బచావో ఆందోళన్" అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.

    ఈ సంస్థ ద్వారా వేలాది మంది బాలులను వెట్టిచాకిరీ, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించారు.

    ఆయన సేవలకు గుర్తింపు క్రమంలో, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌తో కలిసి, కైలాష్ సత్యార్థికి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేశారు.

    మదర్ థెరిసా తర్వాత, మన దేశం తరఫున నోబెల్ శాంతి బహుమతి పొందిన రెండో వ్యక్తిగా కైలాష్ సత్యార్థి గుర్తించబడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నోబెల్ బహుమతి

    తాజా

    IPL 2025: ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ! ఐపీఎల్
    Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
    Bangladesh: బంగ్లాదేశ్‌ దిగుమతులపై భారత్‌ ఆంక్షలు.. చర్చలతో పరిష్కరించేందుకు సిద్ధమన్న బంగ్లా బంగ్లాదేశ్
    Nandigama Suresh: నందిగం సురేశ్'కు జూన్ 2 వరకు రిమాండ్ విధించిన కోర్టు వైసీపీ

    నోబెల్ బహుమతి

    Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి  స్వీడన్
    Elon Musk: నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్ ఎలాన్ మస్క్
    Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్‌ ఆంబ్రోస్‌,గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌   టెక్నాలజీ
    Nobel Prize: నోబెల్ బహుమతి.. మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలివే!  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025