Infinix కంపెనీ నుంచి Note 30 VIP రిలీజ్.. ఫీచర్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
Infinix కంపెనీ నుంచి 5జీ స్టార్ట్ ఫోన్ నోట్ 30 విఐపి మొబైల్‌ని మంగళవారం ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 8Gb, 12GB RAM, 256 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈ మొబైల్ ఫోన్ గ్లేసియర్ వైట్, మ్యాజిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.24,600గా ఉండనుంది. ఇందులో 6.67 అంగళాల పూర్తి HD+ (2,400 x 1080 పిక్సెల్‌లు) AMOLED డిస్ ప్లే తో రానుంది.
ముఖ్యంగా అండ్రాయిడ్ 13X OS 13తో ఈ మొబైల్ రన్ కానుంది. ప్రత్యేకంగా సెల్ఫీ కోసం 32MP కెమెరాతో అద్భుతంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది.
Details
Note 30 VIP మొబైల్ లో అద్భుత ఫీచర్లు
ఫోన్ బ్యాక్ సైడ్ 108MP కెమెరా, రెండు 2MP డెప్త్, మాక్రో కెమెరాలు ఉన్నాయి. అక్టా-కోర్ Media Tek డైమెన్సిటీ 8050 SoC ద్వారా పనిచేయనుంది.
68W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కూడా అందించారు. అదే విధంగా 50W వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కు కూడా ఈ మొబైల్ సపోర్టు చేయనుంది. కేవలం 30 నిమిషాల్లోనే 50శాతం ఛార్జింగ్ ఎక్కనుంది.
ఈ మొబైల్లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.2, GPS/GLONASS, NFC, USB టైప్-C ఉన్నాయి.