Page Loader
నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్‌ చిత్రాలు లీక్
నథింగ్ స్పీకర్‌లో మూడు బ్లాక్ కటౌట్‌లు ఉన్నాయి

నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్‌ చిత్రాలు లీక్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 04, 2023
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

నథింగ్ నుండి ఇయర్ ఫోన్స్, ఇయర్ స్టిక్ తర్వాత బ్రాండ్ నుండి నాల్గవ ఉత్పత్తిగా స్పీకర్‌ వస్తుంది. నథింగ్ కంపెనీ ఇప్పుడు తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మొబైల్, ఇయర్‌బడ్‌ల తో పాటు స్పీకర్‌ ను చేర్చింది. JBL, హర్మాన్, UE ఆధిపత్యంలో ఉండే మార్కెట్‌లోకి ఒక స్టార్ట్-అప్ నుండి వస్తున్న మొదటి ఆడియో స్పీకర్ ఇది. నథింగ్ స్పీకర్ నథింగ్ ఫోన్, TWS ఇయర్‌బడ్‌ల లాగానే ప్రత్యేకమైన డిజైన్‌ తో వస్తుంది. లీకైనా చిత్రాల ప్రకారం, స్పీకర్ బాక్సీ డిజైన్‌ తో రెండు వైపులా వాల్యూమ్/పవర్ బటన్‌లతో వస్తుంది. ఎడమ వైపున, స్పీకర్ బటన్‌ ఎరుపు రంగులో ఉంటుంది. ముందు భాగంలో 'నథింగ్' లోగో ఉంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కార్ల్ పీ ట్వీట్ ద్వారా నథింగ్ స్పీకర్ గురించి ప్రకటించారు

ఫోన్

స్పీకర్ బేస్‌లో రబ్బరు ప్యాడింగ్‌లు ఉన్నాయి

ముందు భాగంలో, నథింగ్ స్పీకర్‌లో మూడు బ్లాక్ కటౌట్‌లు ఉంటాయి, వాటిలో రెండు ట్వీకర్‌లుగా పని చేయవచ్చు. మధ్యలో ఉన్న రెండు తెల్లని కటౌట్‌లు ఉన్నాయి. స్పీకర్ బేస్‌లో రబ్బరు ప్యాడింగ్‌లు ఉన్నాయి. జారుగా ఉండే చోట ఉంచినప్పుడు, ఈ ప్యాడింగ్‌లు స్పీకర్‌కు మంచి పట్టును ఇస్తాయి. ప్రస్తుతానికి, నథింగ్ నుండి రాబోయే స్పీకర్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి వివరాలు ఏమి తెలియదు. అలాగే, మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది తెలియలేదు. ఆసక్తి పెంచడానికి విడుదల అయ్యేవరకు ఆ సంస్థ ఖచ్చితంగా కొన్ని వివరాలను వెల్లడించదు.