LOADING...
NVIDIA: గేమర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఎన్విడియా 'జీఫోర్స్ నౌ'.. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం
NVIDIA: భారత్‌లో ఎన్విడియా 'జీఫోర్స్ నౌ'.. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం

NVIDIA: గేమర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఎన్విడియా 'జీఫోర్స్ నౌ'.. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ గేమింగ్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ సంస్థ నివిడియా (NVIDIA) తన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ 'జీఫోర్స్ నౌ'ను భారత్‌లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 2025 జనవరిలో చేసిన ప్రకటన తర్వాత దాదాపు 15 నెలలుగా ఎదురుచూస్తున్న ఈ సర్వీస్ ఏప్రిల్ 16 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ప్రారంభంలో బీటా రూపంలో మాత్రమే ఈ సర్వీస్ అందిస్తారు. ఇప్పటికే ఎన్విడియా ఇండియా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వినియోగదారులకు ముందుగా యాక్సెస్ ఇవ్వనున్నారు.

వివరాలు 

4K గేమింగ్ అనుభవం భారత్‌లో..

ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న గేమ్స్‌ను ఏ డివైస్‌లోనైనా ఆడుకోవచ్చు. ఇందుకు Steam, Xbox, Epic Games, GOG, Ubisoft వంటి గేమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లను లింక్ చేస్తే సరిపోతుంది. వెబ్ బ్రౌజర్ ద్వారా గేమ్స్‌ను స్ట్రీమింగ్ చేయొచ్చు. అమెరికా, యూకేలో ఉన్నట్లే భారత్‌లో కూడా ఎన్విడియా స్వంత సర్వర్లతో ఈ సేవను అందించనుంది. ముఖ్యంగా బ్లాక్‌వెల్ టెక్నాలజీతో పనిచేసే RTX 5080 సర్వర్లు భారత్‌కు తీసుకొస్తోంది. వీటి ద్వారా అల్టిమేట్ ప్లాన్‌లో 4K క్వాలిటీతో 120fps వరకు గేమింగ్ అనుభవం పొందవచ్చు. అలాగే ఫ్రీ ప్లాన్, పెర్ఫార్మెన్స్ ప్లాన్ వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్లాన్‌ల ధరల వివరాలు ఇంకా ప్రకటించలేదు.

Advertisement