LOADING...
NVIDIA: నీవీడియా కొత్త DGX Spark: ఏఐ సూపర్‌కంప్యూటర్ రేపు విడుదల
ఈ యంత్రం ధర ప్రారంభంలో $3,000

NVIDIA: నీవీడియా కొత్త DGX Spark: ఏఐ సూపర్‌కంప్యూటర్ రేపు విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

నివిడియా వ్యక్తిగత ఏఐ సూపర్‌కంప్యూటర్ రేపు మార్కెట్లోకి రాబోతుంది. DGX Spark అని పేరు పెట్టిన ఈ పరికరం అక్టోబర్ 15న అధికారికంగా అమ్మకానికి లభిస్తుంది. డెస్క్‌టాప్‌లో సరిపోయేలా చిన్నదైనప్పటికీ, సంక్లిష్టమైన ఏఐ మోడళ్లను సులభంగా నడిపించగల శక్తివంతమైన పరికరం ఇది. మొదట దీని ధర $3,000 అని ప్రకటించగా, ప్రస్తుతం నీవీడియా అధికారిక వెబ్‌సైట్‌లో $3,999కు అందుబాటులో ఉంచారు. DGX Spark ప్రత్యేకతలలో NVIDIA GB10 Grace Blackwell సూపర్‌చిప్, 128GB యూనిఫైడ్ మెమరీ, 4TB వరకు NVMe SSD స్టోరేజ్ ఉన్నాయి. ఇది ఒక పిటాఫ్లాప్ శక్తిని అందించగలదు,అంటే ఒక్క సెకనులో మిలియన్ బిలియన్ల లెక్కింపులు చేయగల సామర్థ్యం కలిగి ఉంది,అలాగే 200బిలియన్ పరామీటర్ల వరకు ఏఐ మోడళ్లను నిర్వహించగలదు.

వివరాలు 

అత్యాధునిక ఏఐ సామర్థ్యాలు 

నీవీడియా ఈ DGX Spark ద్వారా అత్యాధునిక ఏఐ సామర్థ్యాలను ప్రతి పరిశోధక, డేటా సైంటిస్ట్, విద్యార్థి వాడకానికి అందించాలనుకుంటోంది. ప్రతి డెస్క్‌లో ఏఐ సూపర్‌కంప్యూటర్ ఉంచడం ద్వారా, డేటా సైంటిస్ట్‌లు, ఏఐ పరిశోధకులు, విద్యార్థులు ఈ ఏఐ యుగాన్ని అర్థం చేసుకోవడంలో, దానికి ఆకారం ఇవ్వడంలో సులభంగా పాల్గొనగలరు," అని నీవీడియా CEO జెంసన్ హువాంగ్ అన్నారు. అలాగే, Acer, ASUS, Dell, Gigabyte, HP, Lenovo, MSI వంటి కంపెనీలు DGX Spark తమ ప్రత్యేక అనుకూలీకరించిన మోడళ్లను విడుదల చేయనున్నారు. దీంతో ఈ సరికొత్త సాంకేతికత ఎక్కువ మార్కెట్లలో లభించగలుగుతుంది దీంతో ఎక్కువ మందికి చేరుతుంది.