Page Loader
OnePlus Community Sale: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!
వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!

OnePlus Community Sale: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ అయిన వన్‌ప్లస్, తాజా సేల్‌ను ప్రకటించింది. ఈ "వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్" డిసెంబర్ 6 నుండి 17 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 4 వంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించబడతాయి. అదేవిధంగా, బ్యాంకు డిస్కౌంట్లు,12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు వన్‌ప్లస్ వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ఇతర ప్రముఖ వేదికలపై కూడా లభిస్తాయి.

వివరాలు 

వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకంగా పెద్ద డిస్కౌంట్‌ 

ఈ సేల్‌లో వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకంగా పెద్ద డిస్కౌంట్‌ ఆఫర్ ఉంది. ఫ్లాట్ రూ.6,000 డిస్కౌంట్‌ తో పాటు, ఐసీఐసీఐ బ్యాంక్, వన్‌కార్డ్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.7,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. వన్‌ప్లస్ 12 12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999 కాగా, ఆఫర్ తర్వాత అది రూ.58,999కి తగ్గిపోతుంది. వన్‌ప్లస్ 12ఆర్ పై కూడా రూ.6,000 వరకు డిస్కౌంట్‌, బ్యాంకు కార్డులపై రూ.3,000 డిస్కౌంట్‌ అందించబడుతోంది. దీని 16GB + 256GB వేరియంట్ ధర రూ.39,999.

వివరాలు 

ఇతర ఉత్పత్తులపై కూడా ఆఫర్లు

కమ్యూనిటీ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 పై రూ.3,000 డిస్కౌంట్‌, బ్యాంక్ డిస్కౌంట్ల రూపంలో రూ.2,000 వరకు తగ్గింపు అందించబడుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4,నార్డ్ సీఈ4 లైట్ ఫోన్‌లపై రూ.2,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తే, బ్యాంక్ డిస్కౌంట్‌ రూపంలో రూ.1,000 అదనంగా తగ్గించబడుతుంది. అలాగే, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ వాచ్ 2, వన్‌ప్లస్ వాచ్ 2ఆర్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 వంటి ఇతర ఉత్పత్తులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు వన్‌ప్లస్ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.