OnePlus earbuds: వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్.. 54 గంటల బ్యాటరీ, 52dB నాయిస్ క్యాన్సిలేషన్‌తో అదిరే ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నార్డ్ బడ్స్ 4ను విడుదల చేసింది. గతంలో నార్డ్ బడ్స్ 4 ప్రోను పరిచయం చేసిన సంస్థ.. ఇప్పుడు అదే సిరీస్‌లో ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 52dB రియల్‌టైమ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), 54 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్, ఏఐ ఆధారిత ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్స్‌ను రూపొందించింది.
వివరాలు
ఆకట్టుకునే ఫీచర్లు
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4లో 52dB రియల్‌టైమ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 6 మైక్రోఫోన్‌ల ఆధారిత ఏఐ క్లియర్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది. అలాగే వన్‌ప్లస్ 3డీ స్పేషియల్ ఆడియో, గేమింగ్ కోసం గేమ్ సౌండ్ స్పేషియల్ ఆడియో, టచ్ కంట్రోల్స్, ఏఐ ట్రాన్స్‌లేట్, ఏఐ అసిస్టెంట్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. ఇవి IP55 రేటింగ్‌తో దుమ్ము, నీటి చిమ్ముర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. 12 మి.మీ టైటానియం కోటెడ్ డ్రైవర్లతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో, గత తరం మోడల్‌తో పోలిస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యం 200 శాతం మెరుగుపడిందని కంపెనీ వెల్లడించింది.
వివరాలు
బ్యాటరీ ఎలా ఉంది?
ప్రతి ఇయర్‌బడ్స్‌లో 62mAh బ్యాటరీ ఉండగా, ఛార్జింగ్ కేస్‌లో 530mAh బ్యాటరీను అందించారు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. కేవలం ఇయర్‌బడ్స్‌తోనే 13 గంటల వరకు ప్లేబ్యాక్ సమయం అందుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించారు.
వివరాలు
ధర, రంగులు, సేల్ వివరాలు
ప్రతి ఇయర్‌బడ్స్ బరువు 4.3 గ్రాములు కాగా, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం బరువు 42.5 గ్రాములు. బ్లూటూత్ 6.1, బ్లూటూత్ AAC కోడెక్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ధరను కంపెనీ రూ.3,299గా నిర్ణయించింది. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.3,099కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. స్టెల్లార్ బ్లాక్, ఆస్ట్రల్ టీల్ రంగుల్లో ఈ ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, బ్లింకిట్, మింత్రా, వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 29 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.