LOADING...
Openai And Microsoft : మర్డర్-సూసైడ్ కేసులో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై నష్టం పరిహారం కేసు
మర్డర్-సూసైడ్ కేసులో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై నష్టం పరిహారం కేసు

Openai And Microsoft : మర్డర్-సూసైడ్ కేసులో ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై నష్టం పరిహారం కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో చోటుచేసుకున్న హత్య-ఆత్మహత్య ఘటన నేపథ్యంలో చాట్‌జీపీటీ (ChatGPT)పై నష్టపరిహారం కేసు దాఖ‌లు చేశారు. కెనెక్టికట్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు ప్రముఖ చాట్‌బాట్ చాట్‌జీపీటీ కారణమని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐతో పాటు దాని ప్రధాన పెట్టుబడిదారు మైక్రోసాఫ్ట్‌ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. చాట్‌జీపీటీ వినియోగదారులను మానసికంగా దెబ్బతీస్తోందనే ఆరోపణలు కేసులో నమోదు అయ్యాయి. కెనెక్టికట్‌లోని గ్రీన్‌విచ్ ప్రాంతంలో నివసిస్తున్న 56 ఏళ్ల వ్యక్తి తన 83 ఏళ్ల తల్లిని హత్య చేసిన ఘటన ఈ వివాదానికి కారణంగా నిలిచింది. చాలా రోజులుగా తల్లికొడుకులు ఇద్దరూ చాట్‌జీపీటీతో తరచూ మాట్లాడుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

వివరాలు 

శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో అధికారికంగా కేసు

తనపై ఎవరైనా నిఘా పెట్టారని, తాను ప్రమాదంలో ఉన్నానని ఆ వ్యక్తి తీవ్రంగా అనుమానపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విడుదల చేసిన సమాచార ప్రకారం స్టెయిన్ ఎరిక్ సోయిల్‌బర్గ్ అనే వ్యక్తి తన తల్లి సుజెన్ని ఆడమ్స్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. చాట్‌జీపీటీతో తరచూ మాట్లాడే సోయిల్‌బర్గ్ తన అసాధారణమైన మానసిక స్థితిని ఆ సంభాషణల్లో వ్యక్తం చేసినట్లు విచారణ ధృవీకరించింది. ఈ విషయంలో శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో అధికారికంగా కేసు దాఖలైంది.

వివరాలు 

స్పందించడానికి నిరాకరించిన మైక్రోసాఫ్ట్ 

పిర్యాదుదారుల వాదన ప్రకారం—స్టెయిన్ ఎరిక్ గంటల కొద్దీ చాట్‌జీపీటీతో మమేకమవడం వల్ల అతనిలో అనుమానాలు తీవ్రమయ్యాయి, చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదంగా భావించే స్థితికి చేరుకున్నాడు, చివరకు తన తల్లిపైనే భయాందోళనలు పెరిగి హత్యకు దారి తీసింది. ఆ తరువాత అతడు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐపై నష్టపరిహారం కోరుతూ కేసు వేసినట్లు సమాచారం. ఇదే విషయంపై స్పందించమని అడిగినప్పటికీ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

Advertisement