ChatGPT: చాట్‌జీపీటీకి 400 మిలియన్లకు యాక్టివ్ యూజర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ప్రజాదరణ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది.
పోటీదారులు ఎంతోమంది ఉన్నా, చాట్‌జీపీటీకి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
గతేడాది డిసెంబర్‌తో పోల్చితే ప్రస్తుతం దీని వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఓపెన్‌ఏఐ సీఓఓ బ్రాడ్ లైట్‌క్యాప్ వెల్లడించారు.
వారి సేవలు మరింత మంది వినియోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం, చాట్‌జీపీటీకి ప్రతి వారం 400 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు, ఇది డిసెంబర్‌లో 300 మిలియన్లు మాత్రమే.
కేవలం వ్యక్తులే కాదు,కంపెనీలు కూడా దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయి, ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా సంస్థలు ఈ ఏఐ సేవలను ఉపయోగిస్తున్నాయి.
వివరాలు
డెవలపర్లలో ఆసక్తి - ఏఐ మోడళ్ల వినియోగంలో పెరుగుదల
ఉబర్,మోర్గాన్ స్టాన్లీ,టీ-మొబైల్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఓపెన్‌ఏఐ సేవలను తమ వ్యాపార కార్యకలాపాల్లో వినియోగిస్తున్నాయి.
ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన ఏఐమోడళ్లను అనేక మంది డెవలపర్లు తమ స్వంత యాప్‌లలో కూడా వినియోగిస్తున్నారు.
గత ఆరు నెలల్లో ఈ సంఖ్య రెట్టింపు కాగా,అడ్వాన్స్‌డ్ రీజనింగ్ మోడళ్ల వినియోగం ఐదు రెట్లు పెరిగింది.
కృత్రిమ మేధా రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతోంది.చైనాకు చెందిన డీప్‌సీక్ అనే ఏఐ సంస్థ గ్లోబల్ మార్కెట్‌లో సడెన్‌గా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించింది.
మరోవైపు,ఎలాన్ మస్క్ గ్రోక్ ఏఐ కూడా నూతన అప్‌గ్రేడ్‌లతో తన సేవలను మరింత మెరుగుపరుస్తోంది.
అయినప్పటికీ, చాట్‌జీపీటీ మాత్రం తన వినియోగదారుల సంఖ్యను స్థిరంగా పెంచుకుంటూ,ఏఐ రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.