OpenAI GPT-6: ఓపెన్‌ఏఐ జిపిటి-6 విడుదల.. చాట్‌జీపీటీలో విజువల్స్, ఇంటరాక్టివ్ ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ తన అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న GPT-6 మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 7న Plus, Pro, Business, Enterprise వినియోగదారులకు తొలుత ఈ అప్‌డేట్‌ను అందించిన సంస్థ.. తాజాగా Free, Go యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చింది. GPT-6లో 'Intelligent UI' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ChatGPT కేవలం టెక్స్ట్‌తో సమాధానాలు ఇవ్వకుండా.. విజువల్స్, డయాగ్రామ్‌లు, ఫారాలు, క్లిక్ చేయగల బటన్లు, ఇతర ఇంటరాక్టివ్ అంశాలను కూడా రూపొందించగలదు.
వివరాలు
GPT-6లో 'Intelligent UI' ప్రత్యేక ఆకర్షణ
GPT-6లోని Intelligent UI ఫీచర్ ChatGPTను పూర్తిగా టెక్స్ట్ ఆధారిత ఇంటర్‌ఫేస్ నుంచి మరింత ఇంటరాక్టివ్‌గా మార్చనుంది.
ఉదాహరణకు.. సైకిల్ గురించి అడిగితే దాని వివిధ భాగాలను చూపించే ఇంటరాక్టివ్ డయాగ్రామ్‌ను ChatGPT రూపొందిస్తుంది.
అంతేకాకుండా అవసరానికి అనుగుణంగా కాలిక్యులేటర్లు, బిల్లు షేర్ చేసే టూల్స్ వంటి వాటిని కూడా అక్కడికక్కడే తయారు చేయగలదు.
దీంతో యూజర్లు సమాచారం చదవడమే కాకుండా.. దానితో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొత్త ఇంటర్‌ఫేస్ సమాధానాలను దృశ్యపరంగా ఇంటరాక్టివ్‌గా చేస్తుంది
GPT-6 and Intelligent UI, now rolling out in ChatGPT for everyone.
— OpenAI (@OpenAI) October 7, 2026
Intelligent UI in ChatGPT delivers fast, interactive answers that make everyday questions more visual, complex topics easier to grasp, and interactive tools for your task available on the spot. pic.twitter.com/XL2gDCPBwG
వివరాలు
ఆలోచిస్తూనే సమాధానం ఇవ్వనున్న GPT-6
GPT-6లో రీజనింగ్ సామర్థ్యాన్ని కూడా OpenAI మెరుగుపరిచింది.
ఇప్పటివరకు మోడల్ తన ఆలోచనా ప్రక్రియ లేదా టూల్స్ వినియోగం పూర్తయ్యే వరకు సమాధానం ఇవ్వడానికి వేచి ఉండాల్సి వచ్చేది.
అయితే GPT-6 ఆలోచిస్తూనే లేదా టూల్స్ ఉపయోగిస్తూనే సమాధానం ఇవ్వడం ప్రారంభిస్తుంది. దీంతో యూజర్లకు సమాచారం దశలవారీగా అందుతుంది.
OpenAI నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో అధిక విలువ కలిగిన రోజువారీ ఏజెంట్ టాస్క్‌లలో GPT-6 Extra High.. GPT-5.6 Mediumకు దాదాపు సమాన సమయంలో స్పందించడం ప్రారంభించిందని, అయితే మొత్తం పనితీరులో GPT-5.6 Extra High కంటే మెరుగైన స్కోరు సాధించిందని సంస్థ తెలిపింది.
వివరాలు
వెబ్ సెర్చ్‌లోనూ మరింత వేగం
వెబ్ ఆధారిత పరిశోధనలోనూ GPT-6కు మెరుగుదలలు చేసినట్లు OpenAI వెల్లడించింది.
వెబ్ సెర్చ్ అవసరమైన సందర్భాల్లో GPT-6 Instant.. GPT-5.6 Instant కంటే సగటున 44 శాతం వేగంగా స్పందిస్తుందని తెలిపింది.
అంతేకాకుండా ఎప్పుడు వెబ్‌లో సెర్చ్ చేయాలి, ఏ సమాచారం తన సమాధానానికి ఉపయోగపడుతుంది అనే విషయాలను గుర్తించే సామర్థ్యం కూడా మెరుగుపడిందని పేర్కొంది.
వివరాలు
భద్రతా చర్యలు మరింత పటిష్ఠం
GPT-6లో భద్రతా పరమైన మార్పులు కూడా చేసినట్లు OpenAI తెలిపింది.
పలు దశల్లో సేఫ్టీ నిబంధనలను తప్పించుకునే ప్రయత్నాలను గుర్తించి అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచింది.
సైబర్ దాడులు, బయోలాజికల్ బెదిరింపులు వంటి అధిక ప్రమాదం కలిగించే దుర్వినియోగాలను నిరోధించేందుకు రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు సంస్థ వెల్లడించింది.
వివరాలు
వారానికి 120 కోట్ల మందికి పైగా ChatGPT వినియోగం
ChatGPTలో చెల్లింపు ప్లాన్లను ఉపయోగించే వారికి GPT-6 Sol, Free, Go యూజర్లకు GPT-6 Luna మోడళ్లు అందుబాటులో ఉంటాయని OpenAI తెలిపింది.
ప్రస్తుత అప్‌డేట్ కేవలం ChatGPT చాట్ అనుభవానికే పరిమితం. ChatGPT Work, Codexకు శక్తినిచ్చే మోడళ్లలో ఈ విడుదలతో ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వారానికి 120 కోట్ల మందికి పైగా ChatGPTను ఉపయోగిస్తున్నారని OpenAI తెలిపింది.
వినియోగదారులు ముందుగా నిర్ణయించిన ఇంటర్‌ఫేస్‌లకు అనుగుణంగా మారాల్సిన అవసరం లేకుండా.. సాఫ్ట్‌వేర్‌నే వారి అవసరాలకు అనుగుణంగా మార్చే దిశలో ఇది కీలక అడుగుగా సంస్థ భావిస్తోంది.