Loading...
OpenAI: కెనడా స్కూల్ కాల్పుల ఘటన.. ఓపెన్‌ఏఐపై 30 కొత్త కేసులు
కెనడా స్కూల్ కాల్పుల ఘటన.. ఓపెన్‌ఏఐపై 30 కొత్త కేసులు

OpenAI: కెనడా స్కూల్ కాల్పుల ఘటన.. ఓపెన్‌ఏఐపై 30 కొత్త కేసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని టంబ్లర్ రిడ్జ్ స్కూల్ కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్‌ఏఐపై మరో 30 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన జరిగిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపల్ ఈ దావాలను దాఖలు చేశారు. 18 ఏళ్ల అనుమానితుడు జెస్సీ వాన్ రూట్‌సెలార్‌కు ఓపెన్‌ఏఐ 'గణనీయమైన సహాయం, ప్రోత్సాహం' అందించిందని వారు ఆరోపించారు. 2026 ఫిబ్రవరి 10న వాన్ రూట్‌సెలార్ ఓ నివాస ప్రాంతం, ఓ సెకండరీ స్కూల్‌లో కాల్పులు జరిపినట్లు కేసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అనంతరం అతడు తనకు తానే కాల్చుకుని మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

కాల్పులపై నిందితుడి చాట్‌లను ఓపెన్‌ఏఐ గుర్తించిందా?

కాల్పుల నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి, చాట్‌జీపీటీకి మధ్య జరిగిన తుపాకీ హింసకు సంబంధించిన సంభాషణలను ఓపెన్‌ఏఐ ఆటోమేటెడ్ రివ్యూ వ్యవస్థ గుర్తించిందని దావాల్లో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కెనడా అధికారులకు తెలియజేయాలని సంస్థ భద్రతా విభాగం సూచించినప్పటికీ, ఓపెన్‌ఏఐ మౌనం వహించిందని ఆరోపించారు.

కంపెనీ ప్రతిష్ఠ, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసుల్లో పేర్కొన్నారు.

ఈ నిర్ణయంలో ఓపెన్‌ఏఐ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్ లెహేన్ పాత్ర ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి.

వివరాలు 

కేసులపై స్పందించిన ఓపెన్‌ఏఐ

తాజా కేసులపై ఓపెన్‌ఏఐ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జేసన్ క్వాన్ స్పందించారు.

ఎక్స్ వేదికగా ఆయన ఈ ఆరోపణలను ఖండించారు.

తమ భద్రతా బృందాలపై చేస్తున్న ఆరోపణలు 'అసత్యమైనవని' పేర్కొన్నారు.

క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పడం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు.

తమ నిర్ణయాలపై రాజకీయ లేదా ప్రజా సంబంధాల అంశాలు ప్రభావం చూపాయన్న వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

ఖాతా నిలిపివేసినా మళ్లీ చాట్‌జీపీటీ వాడాడా?

నిందితుడి ఖాతాను పూర్తిగా నిషేధించకుండా కేవలం డీయాక్టివేట్ చేయడం ద్వారా అతడు మళ్లీ చాట్‌జీపీటీని ఉపయోగించే అవకాశం పొందాడని దావాల్లో ఆరోపించారు.

మరో ఈమెయిల్ చిరునామాతో కొత్త ఖాతా తెరిచి అతడు ఏఐ చాట్‌బాట్‌ను తిరిగి ఉపయోగించగలిగాడని పేర్కొన్నారు.

నిందితుడికి ఈ టూల్‌ను కొనసాగిస్తూ ఉపయోగించే అవకాశం కల్పించడమే గణనీయమైన సహాయంగా పరిగణించవచ్చని కేసులో వాదించారు.

ఈ చర్యలు కాల్పుల ఘటనకు దోహదపడ్డాయని ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఓపెన్‌ఏఐపై వరుసగా న్యాయపరమైన సవాళ్లు

టంబ్లర్ రిడ్జ్ ఘటనకు సంబంధించిన కేసులతో పాటు ఓపెన్‌ఏఐ ఫ్లోరిడా రాష్ట్రం దాఖలు చేసిన మరో కేసును కూడా ఎదుర్కొంటోంది.

సామూహిక కాల్పులకు పాల్పడిన వ్యక్తులకు సంస్థ సహకరించిందని ఆ కేసులో ఆరోపించారు.

గతేడాది ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించి కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి.

ఇదే సమయంలో సైబర్‌ సెక్యూరిటీ పరీక్షల సందర్భంగా ఓఓపెన్‌ఏఐకి చెందిన ఓ ఏఐ మోడల్ శాండ్‌బాక్స్‌ పరిమితులను దాటి హగ్గింగ్ ఫేస్ సర్వర్లను హ్యాక్ చేసిందన్న మరో భద్రతా ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

ADVERTISEMENT