
AI Talent Race: AI సంచలనం.. ప్రతిభావంతులైన 1,000 మంది సిబ్బందికి ఓపెన్ఏఐ కోట్ల నజరానాలు!
ఈ వార్తాకథనం ఏంటి
పరిమితమైన చిన్న కృత్రిమ మేధ(AI)పరిశోధన బృందాలతో బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీలు నిర్మించవచ్చని ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ చెప్పిన మాటలు పూర్తిగా నిజమే. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ దిగ్గజాల మధ్య కృత్రిమ మేధ రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈపోటీ ఒక దావానలంలా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు,ఇంజినీర్లను ఆకర్షించడానికి గాను ఈ పోటీ 'AI టాలెంట్ రేస్'నుండి సంస్థలను బలవంతంగా ఆకర్షించుకునే దాకా పెరిగింది. అందుకే అత్యున్నత ప్రతిభ కలిగిన కృత్రిమ మేధ ఇంజినీర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కంపెనీలు ఎంత జీతం ఇవ్వకపోతే కూడా,తమ కంపెనీలో చేరేలా పోటీపడుతున్నాయి. సాఫ్ట్‌వేర్ బూమ్ ప్రారంభంలో లక్షల రూపాయల జీతాలు పెద్దవి అనిపించేవి,కానీ ఇప్పుడు అవి కోట్ల రూపాయలకు చేరిపోయాయి.
వివరాలు
ఉద్యోగికి కొన్ని లక్షల నుంచి కొన్ని మిలియన్ల డాలర్ల వరకు బోనస్‌లు
ఈ ప్రతిభను నిలబెట్టుకోవడానికి మిలియన్ల రూపాయల బోనస్‌లు కూడా అందిస్తున్నారు. కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టించిన ఓపెన్‌ఏఐ తన ప్రతిభావంతులైన సిబ్బందికి భారీ బోనస్‌లు ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి కొన్ని లక్షల నుంచి కొన్ని మిలియన్ల డాలర్ల వరకు బోనస్‌లు ఇస్తోంది. ఈ బోనస్‌లు కంపెనీ సిబ్బందిలో సుమారు మూడో భాగానికి అందాయి,అంటే సుమారు 1,000 మందికి. ఇది టెక్నికల్ రీసెర్చ్,ఇంజినీరింగ్ విభాగాలలో ఉన్న వారికే వర్తించేది. ఈ పరిణామాలు GPT-5 మోడల్ విడుదల సమయంలో చోటుచేసుకున్నాయి. ఈ బోనస్‌ల సమయంలో వాటాల విక్రయంతో కంపెనీ విలువ 300బిలియన్ డాలర్ల నుండి 500 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సందర్భంలో ప్రస్తుత,మాజీ ఉద్యోగులకు వాటాలు విక్రయించే అవకాశాలు కూడా కల్పించారు.
వివరాలు
ప్రతిభావంతులను కాపాడుకోవడం ఈ సంస్థలకు పెద్ద సమస్య
నిపుణుల కోసం టెక్ దిగ్గజాల మధ్య వేట మరింత తీవ్రమైంది. సిలికాన్ వ్యాలీ ప్రధాన సంస్థలైన మైక్రోసాఫ్ట్,గూగుల్, మెటా కృత్రిమ మేధ నిపుణులను ఆకర్షించేందుకు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. జీతాలు,పని వాతావరణం వంటి అంశాల కారణంగా ఉద్యోగులు కంపెనీలు మారడం సాధారణమైంది. ముఖ్య ప్రాజెక్టుల్లో ఉన్న ప్రతిభావంతులను కాపాడుకోవడం ఈ సంస్థలకు పెద్ద సమస్య అయింది. గూగుల్ డీప్ మైండ్ ప్రాజెక్టులో పనిచేసే 24 మంది ఇంజినీర్లు,రీసెర్చర్లు భారీ ప్యాకేజీలతో మైక్రోసాఫ్ట్ చేరారు. వీరిలో చాలా మందికి డీప్ మైండ్ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్ బృందంలో పనిచేసిన అనుభవం ఉంది. గూగుల్ జెమినీ AI ఇంజినీరింగ్ విభాగం వీసీపీ అమర్ సుబ్రహ్మణ్యం కూడా మైక్రోసాఫ్ట్ AIలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు.
వివరాలు
మైక్రోసాఫ్ట్ ఇప్పుడు చేసేది అదే పని
ఆయన లింక్డ్ ఇన్ పోస్టులో పని వాతావరణం హర్షదాయకంగా ఉండటం కారణంగా మైక్రోసాఫ్ట్ చేరినట్లు పేర్కొన్నారు. గతంలో డీప్ మైండ్ సంస్థలో పనిచేసిన ఆడమ్ సడోవస్కీ, సోనల్ గుప్తా, జోనస్ రాథ్‌ఫస్ వంటి ప్రముఖులు కూడా గూగుల్ సంస్థను వదిలి వెళ్లారు. గూగుల్ వచ్చిన కొత్తల్లో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఇదే విధంగా లాగేసుకొంది.. ఇప్పుడు అదే పని మైక్రోసాఫ్ట్ చేస్తోంది. మరోవైపు, AI కోడింగ్ స్టార్టప్ 'విండ్సర్ఫ్'ను గూగుల్ 2.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
వివరాలు
మెటా కళ్లు చెదిరే ప్యాకేజీలు..
మరోవైపు, మెటా కూడా AI పోటీలో బలంగా ఉంది. మెటా 14.3 బిలియన్ డాలర్లతో ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను స్థాపించింది. దీనికి గిట్‌హబ్ మాజీ సీఈవో నాట్ ఫ్రెడ్‌మన్, స్కేల్ AI మాజీ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్ నాయకత్వం వహిస్తున్నారు. మెటా ఇప్పటికే యాపిల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, డీప్ మైండ్ వంటి సంస్థల నుండి ప్రతిభావంతులైన ఇంజినీర్లను నియమించింది. ఇటీవల థింకింగ్ మెషిన్స్ వ్యవస్థాపకురాలు మీరా మురాటీ, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మధ్య పోరు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్‌గా మారింది. మెటా తొలుత థింకింగ్ మెషిన్స్‌ను బిలియన్ల డాలర్ల (రూ.8,500 కోట్ల)కి కొనుగోలు చేయాలని ఆఫర్ ఇచ్చింది.
వివరాలు
థింకింగ్ మెషిన్స్‌లోని 50 మంది కీలక ఉద్యోగులకు వందల కోట్ల రూపాయల ఆఫర్లు
కానీ, కృత్రిమ మేధ స్టార్టప్ విలువ బాగా తెలిసిన మీరా మురాటీ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. దీన్ని మెటా సీఈవో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, థింకింగ్ మెషిన్స్‌లోని 50 మంది కీలక ఉద్యోగులకు వందల కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చారు. ఈ వివరాలు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో వెల్లడయ్యాయి. థింకింగ్ మెషిన్స్ లీడింగ్ రీసెర్చర్ ఆండ్రూ టుల్లోచ్‌కి ఆరు సంవత్సరాల్లో 1.5 బిలియన్ డాలర్లు చెల్లించడానికి మెటా సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆండ్రూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. అతను మెషిన్ లెర్నింగ్‌లో ప్రావీణ్యం కలిగివాడని తెలుస్తుంది.
వివరాలు
కృత్రిమ మేధ రీసెర్చర్లకి డిమాండ్
వెర్సెప్ట్ అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు మాట్ డిట్కేకు మెటా 125 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినప్పటికీ, అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. తర్వాత జుకర్‌బర్గ్ స్వయంగా అతని వద్దకు వెళ్లి ఆ ఆఫర్‌ను 250 మిలియన్ డాలర్ల (రూ.2,196 కోట్ల) పరిహార ప్యాకేజీతో పెంచారు. దీని కారణంగా అతడు ఆ ఆఫర్‌ను అంగీకరించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కృత్రిమ మేధ రీసెర్చర్ల డిమాండ్ ఎంత భారీగా ఉందో స్పష్టంగా తెలియజేస్తుంది.