Page Loader
ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera
AI స్మార్ట్ ప్రాంప్ట్‌లు అనే ఫీచర్‌ను కూడా ప్రారంభించింది

ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 23, 2023
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రౌజర్ల ప్రపంచంలో Opera గూగుల్ Chromeకు ఎప్పుడూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. దీన్ని మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ChatGPT ఎంతో సంచలనం సృష్టించింది. కంపెనీలు, అప్లికేషన్‌లు తమ ఉత్పాదకతను పెంచడానికి వినియోగదారులను ఆకర్షించడానికి OpenAI చాట్‌బాట్‌తో కలుస్తున్నాయి. ఇది Chrome కాకపోతే, ఖచ్చితంగా Mozilla Firefox, మైక్రోసాఫ్ట్ Edgeతో పోటీ పడుతుంది. Opera ఫిబ్రవరిలో AIని ప్రకటించింది. కంపెనీ ఇప్పుడు ChatGPT, ChatSonic రెండింటినీ దాని డెస్క్‌టాప్ బ్రౌజర్‌లు, Opera, Opera GXలో విలీనం చేసింది. AI స్మార్ట్ ప్రాంప్ట్‌లు అనే ఫీచర్‌ను కూడా ప్రారంభించింది, ఇది వెబ్‌సైట్‌లో టెక్స్ట్ ని హైలైట్ చేయడం ద్వారా లేదా వాటిని టైప్ చేయడం ద్వారా ప్రాంప్ట్‌లను రూపొందించడానికి వినియోగదారులకు సహాయపడుతుంది.

గూగుల్

Opera దాని స్వంత GPT-ఆధారిత AI ఇంజిన్‌ను పరిచయం చేయాలని ఆలోచిస్తుంది

Operaలో చాట్‌బాట్‌లను ఉపయోగించడానికి, ముందుగా సెట్టింగ్‌ల ద్వారా 'AI ప్రాంప్ట్‌లను' ఆన్ చేయాలి. ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత, చాట్‌బాట్‌లు సైడ్‌బార్‌లో బటన్‌ ఉంటుంది. టెక్స్ట్‌లను హైలైట్ చేయడం ద్వారా చాట్‌బాట్‌లను ప్రారంభించచ్చు. ఆకుపచ్చ ప్రాంప్ట్‌లు ChatGPTని ఉపయోగిస్తాయి, అయితే పర్పుల్ ప్రాంప్ట్‌లు ChatSonicని ఉపయోగిస్తాయి. Opera దాని స్వంత GPT-ఆధారిత AI ఇంజిన్‌ను పరిచయం చేయాలని ఆలోచిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇప్పటికే GPT-4-తో ఉన్న కోపైలట్ టూల్స్ ను ప్రారంభించింది. Opera వినియోగదారులను ఆకర్షించడానికి రెండు AI చాట్‌బాట్‌లపై బ్యాంకింగ్ చేస్తోంది. భవిష్యత్తులో దాని స్వంత GPT-ఆధారిత AI ఇంజిన్ ఆధారంగా మరిన్ని AI ఫీచర్లను పరిచయం చేయాలని కంపెనీ ఆలోచిస్తుంది.