Page Loader
Oppo Find X8: భారతదేశంలో విడుదలైన ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌.. ధర,ఫీచర్లు వివరాలివే!
భారతదేశంలో విడుదలైన ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌.. ధర,ఫీచర్లు వివరాలివే!

Oppo Find X8: భారతదేశంలో విడుదలైన ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌.. ధర,ఫీచర్లు వివరాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తాజాగా ఫైండ్‌ ఎక్స్‌ 8 సిరీస్‌లో రెండు కొత్త ప్రీమియం ఫోన్లను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లోని మొబైల్‌ మోడళ్లలో ఫైండ్‌ ఎక్స్‌8 (Oppo Find X8) మరియు ఫైండ్‌ ఎక్స్‌8 ప్రో (Find X8 Pro) ఉన్నాయి. ప్రత్యేకంగా, ఈ రెండు ఫోన్లు ఔట్‌ఆఫ్‌ ది బాక్స్ ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తున్నాయి. అలాగే, ఇవి మొదటి సారిగా మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో అనుసంధానించిన ఫోన్లుగా మార్కెట్లో అందుబాటులోకి రాబోతున్నాయి.

వివరాలు 

ఈ-స్టోర్‌, ప్లిప్‌కార్ట్‌, ప్రధాన రిటైల్‌ ఔట్‌లెట్లలో కొనుగోలుకు..

ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8 12GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.69,999గా ఉంది, ఇక 16GB RAM + 512GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.79,999గా ఉంది. ఈ ఫోన్‌ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటాయి: స్పేస్ బ్లాక్‌, స్టార్‌ గ్రే. ఫైండ్‌ ఎక్స్‌8 ప్రో సింగిల్‌ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది, దీని ధర రూ.99,999. పెరల్‌ వైట్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లు డిసెంబర్‌ 3 నుంచి ఒప్పో ఈ-స్టోర్‌, ప్లిప్‌కార్ట్‌, ప్రధాన రిటైల్‌ ఔట్‌లెట్లలో కొనుగోలుకు లభించనుంది.

వివరాలు 

6.59 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే

ఫీచర్లను చూస్తే, ఫైండ్‌ ఎక్స్‌8, ఎక్స్‌8 ప్రో రెండూ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15తో పనిచేస్తాయి. ఫైండ్‌ ఎక్స్‌8 మోడల్‌లో 6.59 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 4,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫైండ్‌ ఎక్స్‌8 ప్రో మోడల్‌లో 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే, అలాగే అదే 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తుంది. ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8 లో 50 MP సోనీ ఎల్‌టీవై-700 ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50 MP పెరిస్కోప్‌ టెలిఫొటో లెన్స్‌ కలిపి 3X ఆప్టికల్‌ జూమ్‌ సపోర్ట్‌ను అందిస్తుంది.

వివరాలు 

 6X జూమ్‌ సపోర్ట్‌ కలిగిన మరో 50 MP సెన్సర్‌ 

ముందు భాగంలో 32 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫైండ్‌ ఎక్స్‌8 ప్రోలో 50 MP సోనీ ఎల్‌వైటీ-808 కెమెరా, 50 MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా,50 MP పెరిస్కోపిక్‌ కెమెరాతో పాటు 6X జూమ్‌ సపోర్ట్‌ కలిగిన మరో 50 MP సెన్సర్‌ ఉంటుంది.ముందు భాగంలో 32MP కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 5G, బ్లూటూత్‌ 5.4, ఎన్‌ఎఫ్‌సీకి సపోర్ట్‌ చేస్తాయి.ఫైండ్‌ ఎక్స్‌8 లో 5,630mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W ఎయిర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంది. ఫైండ్‌ ఎక్స్‌8 ప్రోలో 5,910 mAh బ్యాటరీ,ఫాస్ట్‌ ఛార్జింగ్‌ స్పీడ్స్ అందుబాటులో ఉంటాయి,10W రివర్స్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో. ఈ రెండు ఫోన్లు ఐపీ68/ఐపీ69 రేటింగ్‌తో కూడిన వాటితో వస్తాయి.