
Oppo K13 5G: బిగ్ బ్యాటరీతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. గంటలోనే బ్యాటరీ ఫుల్
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో,తన కొత్త ఫోన్ "ఒప్పో K13 5జీ"ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
గత సంవత్సరంలో వచ్చిన K12 మోడల్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ పరిచయం చేసింది.
భారీ బ్యాటరీ సామర్థ్యం,వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు దీని విశేషాలను తెలుసుకుందాం.
ఒప్పో K13 5జీ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది.ఇది 120Hz రిఫ్రెష్‌రేట్, గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు కలర్ ఓఎస్ 15తో నడుస్తోంది. వెట్ టచ్, గ్లోవ్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
వివరాలు
7000 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీ
ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6th జనరేషన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.కెమెరా సెక్షన్‌లో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీల కోసం ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇంకా ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి,ఉదాహరణకు - AI క్లారిటీ ఎన్‌హ్యాన్సర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్, AI అన్‌బ్లర్, AI ఎరేజర్ 2.0 వంటివి.
అలాగే ఐఆర్ రిమోట్ కంట్రోల్,డ్యూయల్ స్టీరియో స్పీకర్ల మద్దతు కూడా ఈ ఫోన్‌లో ఉంది.
ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది.ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వివరాలు
రెండు ఆకర్షణీయమైన రంగుల్లో..
కంపెనీ ప్రకారం, 0 నుంచి 62 శాతం ఛార్జ్ చేసేందుకు కేవలం 30 నిమిషాల సమయం సరిపోతుంది. అలాగే పూర్తి 100 శాతం ఛార్జింగ్ కోసం 56 నిమిషాలు మాత్రమే పడుతుంది.
డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ 8.45 మిల్లీమీటర్ల మందంతో, సుమారు 208 గ్రాముల బరువుతో రూపొందించబడింది.
ధర విషయానికి వస్తే, 8జీబీ RAM + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించబడింది.
256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.
పర్పుల్, ప్రిజమ్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది.
ఒప్పో అధికారిక వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.