Oppo Reno 11 : సరికొత్త ఫీచర్లతో ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్.. ధర, వివరాలు ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయ్యింది. స్మార్ట్ ఫోన్స్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒప్పో రెనో 11 ఎట్టకేలకు భారత మార్కెట్లోకి వచ్చింది. ఇందులో రెనో 11, రెనో 11 ప్రో మోడల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ సిరీస్‌కు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. ఒప్పో రెనో 11లో 120 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్ కర్వ్డ్ ఫుల్-హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీ చిప్సెట్ దీని సొంతం. ఇక ఒప్పో రెనో 11 ప్రో వర్షెన్‌లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది.
ఒప్పో రెనో 11 స్మార్ట్ ఫోన్ లో మూడు వేరియంట్లు
ఒప్పో రెనో 11లో 8ఎంపీ అల్ట్రా-వైడ్,50ఎంపీ ప్రైమరీ, 32ఎంపీ టెలిఫొటో లెన్స్‌లతో కూడిన కెమెరా సెటప్ రేర్‌లో వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా ఉండనుంది. ఓబ్సీడియన్ బ్లాక్, ఫ్లౌరైట్ బ్లూ, మూన్‌స్టోన్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ. 29,400- రూ. 35,200 మధ్య ఉండనున్నాయి. మరోవైపు ప్రో మోడల్లో 2 వేరియంట్లు ఉండగా వాటి ధరలు సుమారు రూ. 41,000- రూ. 45,500 మధ్యలో ఉన్నాయి.