
Ghibli: 'మా సిబ్బందికి నిద్ర అవసరం.. జీబ్లీ వాడకాన్ని తగ్గించండి' : శామ్ ఆల్ట్‌మన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా, ఫీడ్ మొత్తం జీబ్లీ స్టైల్ ఫొటోలతో నిండిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'జీబ్లీ స్టైల్' ఇమేజ్ జనరేటర్ ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.
యూజర్లను ఆకట్టుకోవడానికి ఓపెన్‌ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జీబ్లీ (Ghibli) స్టూడియోను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకొని యూజర్లు తమ ఫొటోలను యానిమేషన్ తరహా చిత్రాలుగా మార్చుకుంటున్నారు.
అయితే ఇది ఊహించని విధంగా విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ విపరీతమైన వినియోగంపై ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) స్పందించారు.
జీబ్లీ వినియోగం ఆశ్చర్యకరంగా అధికంగా ఉంది. యూజర్లు కాస్త కూల్‌గా ఉంటే మంచిదని శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.
Details
జీబ్లీ వినియోగాన్ని కొంత మేర తగ్గించాలి
తమ సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా! దయచేసి జీబ్లీ వినియోగాన్ని కొంత మేర తగ్గించాలని కోరారు. ఓపెన్‌ఏఐ ఇటీవల చాట్‌జీపీటీలో జీబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేటర్‌ను ప్రవేశపెట్టింది.
అయితే ఈ ఫీచర్‌ను విపరీతంగా వినియోగించడంతో, తమ జీపీయూ (GPU) వ్యవస్థపై భారీ భారం పడుతోందని శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు. అందుకే ఈ ఫీచర్‌కు పరిమితిని విధిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఉచిత యూజర్లకు ఫొటో జనరేషన్‌పై రోజుకు 3 పరిమితిని విధించారు.
అయితే ప్రీమియమ్ యూజర్లకు ఈ లిమిట్ వర్తించదు. ఇక మరోవైపు, గ్రోక్‌లో కూడా జీబ్లీ స్టైల్ ఫోటో జనరేషన్ ఆప్షన్‌ను యూజర్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.