Loading...
PIB Fact Check: కేబుల్,DTH ఛార్జీలు 4-6 రెట్లు పెరగనున్నాయా?.. వాస్తవాన్ని వెల్లడించిన PIB ఫ్యాక్ట్ చెక్
వాస్తవాన్ని వెల్లడించిన PIB ఫ్యాక్ట్ చెక్

PIB Fact Check: కేబుల్,DTH ఛార్జీలు 4-6 రెట్లు పెరగనున్నాయా?.. వాస్తవాన్ని వెల్లడించిన PIB ఫ్యాక్ట్ చెక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో త్వరలోనే 11 కోట్ల టీవీలు మూగబోనున్నాయని,కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల కేబుల్‌,డీటీహెచ్‌ సేవలు భారీగా ఖరీదవుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నెలవారీ ఛార్జీలు నాలుగు నుంచి ఆరు రెట్లు పెరుగుతాయని,టీవీ సేవలు దాదాపు కనుమరుగవుతాయని వైరల్ పోస్టులు చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ జూన్ 12న కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసిందని,టెలివిజన్ ప్రసార సంస్థలు,టెలికాం కంపెనీలకు ఒకే విధమైన నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంటున్నారు.

వివరాలు 

లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి

ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి భారీ స్థాయిలో లైసెన్స్ ఫీజులు లభిస్తాయని, ఆ భారం చివరకు వినియోగదారులపై పడుతుందని కూడా ప్రచారం చేస్తున్నారు.

అంతేకాదు, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కేబుల్ ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లు తమ నెలవారీ ఛార్జీలను నాలుగు నుంచి ఆరు రెట్లు పెంచుతారని, డీటీహెచ్‌, కేబుల్ టీవీ సేవలు క్రమంగా కనుమరుగవుతాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు.

టీవీ సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ వాదనలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని PIB Fact Check పూర్తిగా ఖండించింది.

వివరాలు 

దేశంలో టీవీ సేవలను నిలిపివేసేలా లేదా మూసివేసేలా నిర్ణయం తీసుకోలేదు: కేంద్రప్రభుత్వం 

కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు నాలుగు నుంచి ఆరు రెట్లు పెరగనున్నాయన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.

అలాగే దేశంలో టీవీ సేవలను నిలిపివేసేలా లేదా మూసివేసేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి నిబంధనలు అమల్లోకి రాలేదని పీఐబీ తన అధికారిక సోషల్ మీడియా వేదికలో వెల్లడించింది.

పీఐబీ తెలిపిన వివరాల ప్రకారం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్స్ (టెలివిజన్, రేడియో మరియు సంబంధిత సేవలు) నియమాలు-2026 ముసాయిదాను విడుదల చేసింది.

ఈ ముసాయిదాపై ప్రజలు, సంబంధిత భాగస్వాముల నుంచి 2026 జూలై 27 వరకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కేబుల్‌ లేదా డీటీహెచ్‌ ఛార్జీల పెంపు స్తావన లేదని పీఐబీ స్పష్టం

అత్యంత ముఖ్యంగా, ఈ ముసాయిదా నిబంధనల్లో కేబుల్‌ లేదా డీటీహెచ్‌ ఛార్జీల పెంపు గురించి ఎక్కడా ప్రస్తావన లేదని పీఐబీ స్పష్టం చేసింది.

టెలివిజన్‌, రేడియో సేవలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న వివిధ మార్గదర్శకాలను ఒకే చట్రంలోకి తీసుకురావడం, నియమాలను సరళీకరించడం, ప్రసార రంగంలో సమన్వయాన్ని పెంచడం, వ్యవస్థను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించడం మాత్రమే ఈ ముసాయిదా లక్ష్యమని వివరించింది.

అందువల్ల కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు ఆరు రెట్లు పెరుగుతాయని, 11 కోట్ల టీవీలు మూగబోతున్నాయని లేదా టీవీ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మాల్సిన అవసరం లేదని పీఐబీ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

PIB ఫ్యాక్ట్ చెక్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT