Page Loader
chandrayaan-3: ఇస్రో నుంచి మరో వీడియో.. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ చక్కర్లు 
ఇస్రో నుంచి మరో వీడియో.. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ చక్కర్లు

chandrayaan-3: ఇస్రో నుంచి మరో వీడియో.. చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ చక్కర్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2023
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి చెందిన మూన్ రోవర్ ప్రజ్ఞాన్ ఈసారి మరొక సాంకేతికత ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంలో సల్ఫర్, ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించింది. కొనసాగుతున్న చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ పురోగతిని ప్రకటించింది. అయితే, చందమామపై బండరాళ్లు, బిలాలతో నిండి ఉండడం వల్ల నడవాల్సిన సురక్షిత మార్గాన్ని కూడా సక్రమంగా ఎంచుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇస్రో తాజాగా ఎక్స్‌లో పంచుకుంది. "సురక్షితమైన మార్గం కోసం రోవర్‌ తిరుగుతోంది. ప్రజ్ఞాన్ రోవర్ భ్రమణం ల్యాండర్ ఇమేజర్ కెమెరా ద్వారా క్యాప్చర్ బంధించబడింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే.. చందమామ పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది కదా ఈ వీడియో'' అంటూ ఇస్రో రాసుకొచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో చేసిన ట్వీట్