
Prophase: సైబర్ యుద్ధంలో భారత్ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్'
ఈ వార్తాకథనం ఏంటి
తిరువనంతపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ "ప్రొఫేజ్" మే 5న ప్రారంభమైన సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది.
నాలుగు రోజుల పాటు నిరంతరం ముప్పులను గుర్తించి అరుదైన ఘనత సాధించింది. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం, ఆ సమయంలో దాదాపు 85 మిలియన్ల సైబర్ ముప్పులను గుర్తించి బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది.
అంతేకాక మూడు విమానాశ్రయాలపై జరిగే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. వీటిలో ఒకటి టియర్-1 విమానాశ్రయమని, సంస్థ వెల్లడించినా పేరు గోప్యంగా ఉంచింది.
Details
ముందే ముప్పును కనిపెట్టిన ప్రొఫేజ్
2019లో వైశాఖ్ టీఆర్, లక్ష్మీదాస్‌ల ఆధ్వర్యంలో స్థాపించిన ప్రొఫేజ్ సంస్థ, సంస్థలకు తేలికైన, వేగవంతమైన సైబర్ భద్రతను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
ప్రస్తుతం భారత్‌లోని 100కి పైగా సంస్థలకు ప్రొఫేజ్ సేవలందిస్తోంది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య భౌతిక యుద్ధం మొదలయ్యే ముందు నుంచే సైబర్ దాడులు ప్రారంభమయ్యాయని ప్రొఫేజ్ సహ స్థాపకురాలు, సీఓఓ లక్ష్మీదాస్ తెలిపారు.
మే 5న చిన్న స్థాయిలో ప్రారంభమైన దాడులు మే 8, 9 తేదీల్లో తీవ్రమయ్యాయని, కానీ తమ టెక్నాలజీ వాడిన అన్ని సంస్థలకూ సర్వీసుల్లో ఎటువంటి అంతరాయం కలగలేదని ఆమె స్పష్టం చేశారు.
Details
గతంలోనూ విమానాశ్రయాలను రక్షించిన అనుభవం
ప్రతి రోజు మారుతున్న దాడుల పద్ధతులను జియో ఫెన్సింగ్, ఐటీ ప్రొఫైలింగ్, బిహేవియరల్ అనాలసిస్ వంటి అధునాతన పద్ధతులతో గుర్తించి ఎదుర్కొన్నామని లక్ష్మి చెప్పారు.
పలు దేశాల నుంచి వచ్చిన ముప్పులు ఎక్కువగా ప్రో-పాకిస్తాన్ గ్రూపులవేనని వెల్లడించారు.
2023లో హ్యాకింగ్ గ్రూప్ 'అనానిమస్' ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులకు పాల్పడినప్పుడు కూడా భారత విమానాశ్రయాలపై ముప్పు ఏర్పడింది.
అప్పుడు మూడు ప్రధాన విమానాశ్రయాలకు ప్రొఫేజ్ సేవలందించింది.
Details
'మేడ్ ఇన్ ఇండియా' సైబర్ టెక్‌కు మద్దతు ఇవ్వండి
ఇప్పుడు భారత సంస్థలు విదేశీ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులపై ఆశ్రితంగా ఉన్నాయి.
కానీ సమయం వచ్చింది... దేశీయంగా తయారు చేసిన, సంస్థకు అనుగుణంగా మెరుగుపరిచిన సెక్యూరిటీ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్మీదాస్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.