Page Loader
Zomato Gold and Swiggy One: జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్..
జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్..

Zomato Gold and Swiggy One: జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్..

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో దాదాపు పది సంవత్సరాల క్రితం ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ రంగంలో ప్రవేశించిన స్విగ్గీ, జొమాటో సంస్థలు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రజల మద్దతును సంపాదించుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా అనేక టైర్-1, టైర్-2 నగరాల్లో తమ సేవలను విస్తరించి, వినియోగదారులకు సులభంగా ఆహారం అందించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు, ఈ సంస్థలు తమ సేవలపై నూతన ఛార్జీలను విధించేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా, జొమాటో, స్విగ్గీ సంస్థలు తమ వినియోగదారులకు ప్రత్యేకంగా అందిస్తున్న లాయల్టీ ప్రోగ్రాములలో భాగంగా ఉన్న "సర్ ఛార్జ్ మినహాయింపు" సౌకర్యాన్ని నిలిపివేశాయి.

వివరాలు 

ఇన్వెస్టర్ల నుండి లాభాలపై పెరుగుతున్న ఒత్తిడి

ఈ మార్పు వల్ల జొమాటో గోల్డ్,స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కలిగిన వినియోగదారులు కూడా వర్షం వంటి ప్రత్యేక పరిస్థితులలో ఫుడ్ ఆర్డర్ చేస్తే, రెయిన్ సర్ ఛార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ మెంబర్‌షిప్ వినియోగదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా డెలివరీ సౌకర్యం లభించేది. కానీ తాజా అప్డేట్ ప్రకారం,వీరు కూడా సాధారణ వినియోగదారులుగా పరిగణింపబడి, ప్రతి ఆర్డర్ పై అదనపు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. దీని వెనక అసలు కారణంగా ఫుడ్ డెలివరీ రంగంలోని సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవాలని చూస్తున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్ల నుండి లాభాలపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా వ్యాపారంలో లాభదాయకత సాధించాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపడుతున్నట్టు తెలుస్తోంది.

వివరాలు 

స్విగ్గీ,జొమాటో సంస్థలు ఆదాయాన్ని పెంచుకునేందుకు నూతన వ్యూహాలు 

2024 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకారం జొమాటో కేవలం రూ.39 కోట్లు మాత్రమే లాభంగా ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 78శాతం తక్కువగా ఉండటం గమనార్హం. ఇంకా స్విగ్గీ విషయానికి వస్తే,ఇటీవల ప్రకటించిన ఆర్థిక వివరాల ప్రకారం,సంస్థ నష్టాలు భారీగా పెరిగాయి. గత త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.1,081కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇదే కాలంలో గత సంవత్సరం నష్టాలతో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో,స్విగ్గీ,జొమాటో సంస్థలు తమ ఫుడ్ డెలివరీ కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు నూతన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ప్రతి ఆర్డర్‌పైనే ఎక్కువగా ఆదాయం పొందాలనే ఉద్దేశంతో ఈ సంస్థలు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి.