Page Loader
PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌.. ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధం!
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌.. ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధం!

PSLV-C60 Rocket: రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్‌.. ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 30న రాత్రి 9.58 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈరోజు రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం రాత్రి 9.58 గంటలకు రాకెట్‌ను నింగిలోకి పంపడానికి సిద్ధమయ్యారు. ఇస్రో చైర్మన్ ఎస్‌. సోమనాథ్‌ ఈరోజు రాత్రి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం. అలాగే పీఎస్‌ఎల్‌వీ కోర్‌ అలోన్‌ దశతో నిర్వహించే 18వ ప్రయోగం. ఇస్రో ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది.

Details

ఈ రాకెట్ బరువు 229 టన్నులు

పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ 320 టన్నుల బరువు, 44.5 మీటర్ల ఎత్తు కలిగినదిగా ఉంటే, స్ట్రాపాన్‌ బూస్టర్లను ఉపయోగించకపోవడంతో ఈ రాకెట్‌ బరువు 229 టన్నులుగా ఉంటుంది. కోర్‌ అలోన్‌ దశలో ఈ ప్రయోగం కొనసాగనుంది. రాకెట్‌లో రెండో దశకు ద్రవ ఇంధనం, మూడో దశకు ఘన ఇంధనం, నాలుగో దశకు ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఇస్రో రూపొందించిన స్పాడెక్స్‌ అనే జంట ఉపగ్రహాలు ఈ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని ఛేజర్, టార్గెట్ అనే పేర్లతో నామకరణం చేశారు. ఈ ఉపగ్రహాలు 440 కిలోల బరువుతో, స్పేస్‌ డాకింగ్, ఫార్మేషన్‌ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం వంటి సేవలకు ఉపయోగపడతాయి.