Page Loader
సరికొత్తగా రియల్ మీ 11 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
సరికొత్తగా రియల్ మీ 11 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

సరికొత్తగా రియల్ మీ 11 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

రియల్ మీ నుంచి సరికొత్త 5G ఫోన్ మార్కెట్లోకి రానుంది. లాంచ్ కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్ లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ లాంచ్ తేదీని రివీల్ చేయకముందే భారత మార్కెట్లో రాబోయే రియల్ మీ 11 5Gను టీజ్ చేసింది. దేశంలో రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. డైమెన్సిటీ 6020 5G SoC తో పాటు ఈ ఏడాది మేలో చైనాలో రియల్ మీ 11 ప్రొ, రియల్ మీ 11 ప్రొ ప్లస్ 5జీ లాంచ్ అయ్యాయి. రియల్ మీ దేశంలో కొత్త హ్యాండ్ సెట్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను లీక్ చేసింది.

Details

జూన్ మొదటి వారంలో స్మార్ట్ ఫోన్ లాంచ్

ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో రానుండడం విశేషం. ఈ ఫోన్ గ్లోరీ గోల్డ్, గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రానుంది. రియల్‌మి 11 5G ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ మోడల్ ధర దాదాపు రూ. 18,000తో చైనాలో లాంచ్ అయింది. 8GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ థాయ్‌లాండ్‌లో దాదాపుగా రూ. 23,400తో లాంచ్ అయింది. ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేయనుంది.