సరికొత్త ఫీచర్స్ వస్తోన్న రియల్ మీ 11 ప్రో ప్లస్ లాంచ్ రేపే!
భారత మార్కెట్లోకి రియల్ మీ సంస్థ రోజు రోజుకూ సరికొత్త మోడల్స్ ప్రవేశపెడుతోంది. తాజాగా వినియోగదారులకు ఇష్టాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 11 ప్రో ప్లస్ ను తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో 11 ప్రో 5జీ, 11 ప్రో ప్లస్ 5 జీ వేరియంట్లు రానున్నాయి. ఈ రెండు స్టార్ట్మ్ ఫోన్స్ ను రియల్ మీ రేపు లాంచ్ కానున్నాయి. రియల్ మీ 11 ప్రో ప్లస్ లో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, కర్వ్ డ్ ఎడ్జెస్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లు రానున్నాయి. లీచీ లెథర్ బ్యాక్ ప్యానెల్ వస్తుండటంతో ఇది మారింత ఆకర్షణీయంగా మారనుంది.
రియల్ మీ 11 ప్రో లో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
సన్ రైజ్ బీగ్, ఒయాసిస్ గ్రీన్, ఆస్ట్రల్ బ్లాక్ వంటి రంగుల్లో ఇది మార్కెట్లోకి వస్తోంది. ఈ 5జీ స్టార్ట్ ఫోన్స్ లో వైఫై 6, బ్లూటూత్ 5.2, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉండనుంది. రేర్ కెమెరాతో 4కే వీడియోలు షూట్ చేసుకొనే అవకాశం ఉంది. దీని ధరపై ఇంకా స్పష్టత రాలేదు. 30,000 సెగ్మెంట్ లో ఇండియా మార్కెట్లోకి లాంచ్ అవ్వొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రియల్ మీ 11 సిరీస్ ఇటీవలే చైనాలో లాంచ్ అయ్యింది. అయితే ఈ సిరీస్ ఇంకా సేల్ లోకి వెళ్లకపోవడం గమనార్హం.