Page Loader
Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది
మార్కెట్లో POCO C55తో పోటీపడుతున్న Realme C33 2023

Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 15, 2023
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎక్కువ, అందుకే బ్రాండ్‌లు ప్రతిసారీ కొత్త ఆఫర్‌లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. Realme తన తాజా స్మార్ట్‌ఫోన్‌గా C33 2023ని పరిచయం చేసింది. మార్కెట్లో అదే ధరలో ఉన్న POCO C55తో పోటీపడుతుంది. Realme C33 2023 4GB/64GB, 4GB/128GB కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది, దీని ధర రూ.9,999, రూ.10,499, ఇది ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ రంగుల్లో వస్తుంది. POCO C55 4GB/64GB వేరియంట్ ధర రూ.9,499. 6GB/128GB ధర రూ.10,999. ఫోన్ పవర్ బ్లాక్, కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ ఆప్షన్‌లలో వస్తుంది.

ఫోన్

పెద్ద డిస్‌ప్లే, గేమింగ్-ఫోకస్డ్ MediaTek చిప్ తో ఉన్న POCO C55 కొనడం మంచిది

Realme C33 2023కి UNISOC T612 చిప్‌సెట్ సపోర్ట్ ఉంది, ఇది 4GB RAM, 128GB వరకు స్టోరేజ్ తో వస్తుంది. దీనికి 5,000mAh బ్యాటరీ ఉంది. POCO C55లో MediaTek Helio G85 SoC ఉంది, గరిష్టంగా 6GB RAM నుండి 128GB వరకు స్టోరేజ్ ఉంటుంది. దీనికి కూడా 5,000mAh బ్యాటరీ ఉంటుంది. POCO C55 Realme C33 2023 కంటే మెరుగైన ఆఫర్ అందిస్తుంది. ఇది లెదర్ లాంటి స్టిక్ డిజైన్‌ తో కొంచెం పెద్ద డిస్‌ప్లే, గేమింగ్-ఫోకస్డ్ MediaTek చిప్, RAMని అందిస్తుంది. దీనికి Realme కన్నా తక్కువ ఖర్చు అవుతుంది. స్టైలిష్ లుక్స్, మంచి పనితీరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే, POCO C55 కొనడం మంచిది.