Page Loader
కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌
మార్కెట్లో విడుదలైన Poco C50

కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 03, 2023
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఈరోజే విడుదల చేసింది. Poco C50 పెద్ద 6.5-అంగుళాల డిస్ప్లేతో, 5000mAh బ్యాటరీ, వెనుకవైపు 8-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఫోన్‌లను విడుదల చేయడం లేదు. భారతదేశంలో రూ. 10,000 లోపు ఉన్న ఫోన్‌ను పొందడం కొనుగోలుదారులకు కష్టమవుతోంది. అయితే, Poco C50తో ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మారుతున్న కాలంతో పాటు అందరూ మారాలి కాబట్టి ఇప్పుడు చిన్నా, పెద్దా అందరి చేతిలో ఫోన్ ఉండడం అత్యవసరం అయింది. అందుకే ఖరీదైన ఫోన్లు కొనలేనివారికి అవసరమైన ఫీచర్ల తో ఈ బడ్జెట్ ఫోన్ ఉపయోగకరంగా మారనుంది.

POCO C50

నీలం, పచ్చ రంగుల్లో అందుబాటులో ఉన్న POCO C50

కొత్త లాంచ్ గురించి, POCO ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ మాట్లాడుతూ, "ఇండియాలో 2023 - POCO C50ని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాము. మెరుగైన డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్, గేమింగ్ కెమెరాతో వస్తుంది" అని చెప్పారు. Poco C50 32GB స్టోరేజ్ తో 2GB, 3GB RAM రెండు వేరియంట్‌లలో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 2GB వేరియంట్‌ రూ. 6499 ప్రారంభ ధరకే వస్తుంది, అయితే 3GB వేరియంట్‌ రూ.7299 ధరకు వస్తుంది. అయితే, స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక లాంచ్ ధర 2GB వేరియంట్‌కు రూ.6249, 3GB వేరియంట్‌కు రూ.6999. ఈ స్మార్ట్‌ఫోన్ రాయల్ బ్లూ, కంట్రీ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉంటుంది. POCO C50 జనవరి 10, 2023 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.