చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్
Redmi K60 సిరీస్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో Redmi K60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలు ప్రస్తుతం తెలియదు కానీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E మోడల్స్ ఉన్నాయి. Redmi K60లో 67W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ ఉంది. Redmi K60 Proలో 120W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. Redmi K60Eలో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ ఉంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు, 5G సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ సిరీస్ లో Redmi K60E అతి చవకైన మోడల్
Redmi K60E 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB స్టోరేజ్ మోడల్స్ లో లభ్యమవుతుండగా వీటి ధర 26,200 నుండి 33,400 వరకు ఉంది. Redmi K60 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB స్టోరేజ్ మోడల్స్ లభ్యమవుతుండగా వీటి ధర 29,800 నుండి 42,900 వరకు ఉంది. Redmi K60 Pro 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB స్టోరేజ్ మోడల్స్ లభ్యమవుతుండగా వీటి ధర 39,300 నుండి 54,800 వరకు ఉంది.