Whatsapp : వాట్సాప్ మరో ఫీచర్.. కళ్ళకు ఇబ్బంది లేకుండా..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అద్భుతమైన ఫీచర్స్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్ తాజాగా యూజర్ల కోసం మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ వల్ల కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు చూస్తోంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్ మోడ్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనిని కొత్తగా అప్ డేట్ చేయాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Details
తక్కువ కాంతిని ఇచ్చే విధంగా అప్డేట్
యూజర్ల కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ను తయారు చేస్తున్నారు.
టాప్ బార్, బ్యాక్ గ్రౌండ్, మెసేజ్ బబుల్స్‌లో కలర్ స్కీమ్, సైడ్ బార్ ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేయనున్నారు.
దీంతో తక్కువ కాంతిని ఇచ్చే విధంగా అప్డేట్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవలే వాట్సాప్ స్టేటస్‌లకు ఫోటోలు, వీడియోలు, టెక్ట్స్ ను షేర్ చేసే అవకాశం వాట్సాప్ కన్పిస్తోంది.