
Robo Pregnancy: చైనాలో సంచలన ప్రయోగం.. రోబోతో బిడ్డ పుట్టించే ప్రయత్నం
ఈ వార్తాకథనం ఏంటి
చైనా శాస్త్రవేత్తలు సంతానోత్పత్తి రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. గర్భధారణను అనుకరించే విధంగా ప్రత్యేక రోబోట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పరిశోధకుల మాటల్లో, భవిష్యత్తులో ఈ యంత్రం నిజమైన శిశువుకు జన్మనివ్వగలదని చెబుతున్నారు.
వివరాలు
కృత్రిమ గర్భాశయం - గర్భధారణ ప్రక్రియ
ఈ టెక్నాలజీలో గర్భం కృత్రిమ గర్భాశయంలో పెరుగుతుంది. శిశువు ఎదుగుదల కోసం అవసరమైన పోషకాలను ట్యూబ్ ద్వారా సరఫరా చేస్తారు. అయితే, ఫర్టిలైజేషన్ విధానం గురించి వివరాలను ఇంకా గుప్తంగా ఉంచారు. గ్వాంగ్‌జౌ కేంద్రంగా ఉన్న Kaiwa Technology ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. దీనికి సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీతో అనుబంధం ఉన్న డాక్టర్ జాంగ్ క్విఫెంగ్ నాయకత్వం వహిస్తున్నారు.
వివరాలు
ప్రోటోటైప్.. త్వరలో లాంచ్
డాక్టర్ జాంగ్ తెలిపినట్లుగా, ఈ సిస్టమ్ ఇప్పటికే అభివృద్ధి దశలో ఉంది. ఇప్పుడు రోబోట్ కడుపులో అమర్చే విధానమే అవసరమని చెప్పారు. దాంతో రోబోట్‌తో మనిషి ఇంటరాక్ట్ అవుతూ గర్భధారణ కొనసాగించవచ్చు. 2026 నాటికి ప్రోటోటైప్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని, దాని ధర సుమారు 1 లక్ష యువాన్ (దాదాపు 14 వేల అమెరికన్ డాలర్లు)గా ఉంటుందని వెల్లడించారు.
వివరాలు
సందేహాలు - చర్చలు
అయితే, ఈ కాన్సెప్ట్‌పై తల్లీబిడ్డల అనుబంధం, నైతిక అంశాలపై చర్చ మొదలైంది. అండాలు, వీర్యం ఎలా సమకూరతాయి? అనే ప్రశ్నలు ఇంకా స్పష్టత పొందలేదు. ఈ విధంగా పుట్టే పిల్లల మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుందనే ఆందోళనలను సైకాలజిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 శాతం జంటలు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ పరిశోధనకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మొదటి ప్రయోగం కాదు. ఇప్పటికే 2017లో ముందస్తుగా పుట్టిన గొర్రె పిల్లలను కృత్రిమ గర్భాశయంలో పెంచిన రీసెర్చ్ కూడా జరిగింది. ప్రస్తుతం డాక్టర్ జాంగ్ బృందం, గ్వాంగ్‌డాంగ్ అధికారులతో కలిసి ఈ టెక్నాలజీపై పాలసీ, చట్టపరమైన అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం.