LOADING...
Elon Musk: రోబోలే అన్నీ చూసుకుంటాయి.. రిటైర్మెంట్ గురించి ఆలోచన అక్కర్లేదు : ఎలాన్ మస్క్
రోబోలే అన్నీ చూసుకుంటాయి.. రిటైర్మెంట్ గురించి ఆలోచన అక్కర్లేదు : ఎలాన్ మస్క్

Elon Musk: రోబోలే అన్నీ చూసుకుంటాయి.. రిటైర్మెంట్ గురించి ఆలోచన అక్కర్లేదు : ఎలాన్ మస్క్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్‌, టెక్నాలజీ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మరోసారి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్‌ రంగాల్లో రాబోయే 10 నుంచి 20 ఏళ్లలో జరిగే విప్లవాత్మక మార్పుల వల్ల రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేయాల్సిన అవసరమే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆరోగ్యం, నివాసం, ఆదాయం వంటి మౌలిక అవసరాలన్నీ సమృద్ధిగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రముఖ 'మూన్‌షాట్స్‌ విత్‌ పీటర్‌ డయమాండిస్‌' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మస్క్‌, రిటైర్మెంట్‌ కోసం డబ్బు దాచుకోవాలని ఆందోళన పడొద్దు. మేం చెప్పిన విషయాలు నిజమైతే, వచ్చే 10 లేదా 20 ఏళ్లలో రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ అనేవే అప్రాసంగికంగా మారతాయని వ్యాఖ్యానించారు.

Details

యూనివర్సల్‌ హై ఇన్‌కమ్‌ భవిష్యత్తు

AI, రోబోలు కలిసి స్థిరమైన సమృద్ధి సమాజాన్ని నిర్మిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ఆరోగ్య వ్యయాలు, జీవన వ్యయం పెరుగుతున్నాయనే ఆందోళనల మధ్య భవిష్యత్తుపై ఎందుకు ఆశావహంగా ఉన్నారని ప్రశ్నించగా, మస్క్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రాబోయే రోజుల్లో 'యూనివర్సల్‌ హై ఇన్‌కమ్‌' వ్యవస్థ అమలులోకి వస్తుందని, అయితే ప్రజలకు అన్నీ అందుబాటులోకి వచ్చినప్పుడు కొంత సామాజిక అసంతృప్తి కూడా తలెత్తొచ్చని అన్నారు. తాను సహజంగానే ఆశావాదినేనని పేర్కొన్నారు. "మనుషుల ఊహలకు కూడా అందని స్థాయిలో సమృద్ధి ఏర్పడుతుంది. AI, రోబోలు మానవ అవసరాలన్నింటినీ తీరుస్తాయని మస్క్‌ అన్నారు.

Details

'పని ఐచ్చికం, వస్తువులు దాదాపు ఉచితం'

మరోవైపు వచ్చే 10-20 ఏళ్లలో AI మానవ మేధస్సును మించిపోతుందని, నేటి ఉద్యోగాల్లో సగానికి మించిన వాటిని రోబోలు స్వాధీనం చేసుకుంటాయని అంచనా వేశారు. అయితే దీన్ని ఆయన ప్రతికూలంగా కాకుండా, ఉత్పాదకత పెరిగి ధరలు తగ్గే ఆశాజనక భవిష్యత్తుగా అభివర్ణించారు. ఇటీవల అక్టోబర్‌లో సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన మస్క్‌, AI, రోబోలు అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాయి. పని చేయడం ఐచ్చికంగా మారుతుంది. కూరగాయలు కొనకుండా ఇంట్లోనే పండించుకున్నట్లుగా అని వ్యాఖ్యానించారు. అంతకుముందు టెక్సాస్‌ రాష్ట్రానికి చెందిన అమెరికా సెనేటర్‌ టెడ్‌ క్రూజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భవిష్యత్తులో వస్తువులు, సేవలు దాదాపు ఉచితంగా మారతాయని చెప్పారు.

Advertisement

Details

ఖర్చు అనేది చాలా తక్కువ

పది కోట్ల కాదు... పదుల బిలియన్ల సంఖ్యలో రోబోలు మీకు కావలసిన ప్రతి వస్తువును తయారు చేస్తాయి, ప్రతి సేవను అందిస్తాయి. ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుందని మస్క్‌ పేర్కొన్నారు. దీని వల్ల ప్రజల జీవన ప్రమాణం తగ్గదని, మరింత మెరుగవుతుందని స్పష్టం చేశారు. అయితే, ఈ సమృద్ధి మధ్య మానవ జీవితంలో అసలైన సవాలు వేరే ఉంటుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. "అన్ని లభించిన తర్వాత జీవితం లో తృప్తి, అర్థం ఎలా పొందాలి అన్నదే అసలైన ప్రశ్న" అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement