Page Loader
Itel Geno: ఏఐ ఫీచర్లతో ఐటెల్‌ సర్ప్రైజ్.. రూ. 9,299కే ఏఐ ఫీచర్లతో 8GB ర్యామ్‌ ఫోన్‌!
రూ. 9,299కే ఏఐ ఫీచర్లతో 8GB ర్యామ్‌ ఫోన్‌.. ఏఐ ఫీచర్లతో ఐటెల్‌ సర్ప్రైజ్!

Itel Geno: ఏఐ ఫీచర్లతో ఐటెల్‌ సర్ప్రైజ్.. రూ. 9,299కే ఏఐ ఫీచర్లతో 8GB ర్యామ్‌ ఫోన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! భారత మార్కెట్‌లో తాజాగా ఐటెల్ ఒక కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. 'ఐటెల్ జెనో 5G'. రోజువారీ వినియోగదారుల అవసరాల కోసం రూపొందిన ఈ డివైజ్, 5G కనెక్టివిటితో పాటు శక్తివంతమైన ఫీచర్లను అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో శక్తిని పొందిన ఈ స్మార్ట్‌ఫోన్, ఏఐ-ఆధారిత అనేక సౌకర్యాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Details

ఐటెల్ జెనో 5G: డిస్‌ప్లే, డిజైన్ 

ఐటెల్ జెనో 5G 6.67-ఇంచ్ హెచ్‌డీ+ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. 7.8 మిమీ స్లిమ్ ప్రొఫైల్‌తో ఉన్న ఈ డివైజ్, IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. అదనపు మన్నిక కోసం పాండా MN228 గ్లాస్ రక్షణను కూడా కలిగి ఉంది. ఐటెల్ జెనో 5G: కెమెరా, ఏఐ ఫీచర్లు ఐటెల్ జెనో 5G వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, సెల్ఫీలు,వీడియోకాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. 'ఐవానా' అనే ఐటెల్ ఏఐ అసిస్టెంట్ రైటింగ్, అనువాదం, టెక్స్ట్ సవరణలాంటి పనులకు సహాయపడుతుంది. ఈఫీచర్ వినియోగదారుల ఉత్పాదకత, కమ్యూనికేషన్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

Details

ఐటెల్ జెనో 5G: పనితీరు, సాఫ్ట్‌వేర్

ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో శక్తిని పొందింది. 8జీబీ ర్యామ్‌ (4జీబీ ఫిజికల్ + 4జీబీ వర్చువల్), 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. శక్తివంతమైన 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 10వాట్ల ఛార్జర్‌తో చార్జ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ డ్యూయల్ 5G సిమ్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ-సీ కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తుంది. ఐటెల్ జెనో 5G: ధర, లభ్యత భారతదేశంలో ఐటెల్ జెనో 5G ధర రూ. 9,299గా నిర్ణయించారు. వినియోగదారులు రూ. 1,000 అమెజాన్ కూపన్ ద్వారా ఈ ఫోన్‌ని తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. కాల్క్స్ టైటానియం, షాడో బ్లాక్, వేవ్ గ్రీన్ అనే మూడు రంగులలో లభ్యమవుతోంది.

Details

ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ స్పందన

ఐటెల్ జెనో 5G గురించి సీఈఓ అరిజీత్ స్పందించారు. "ఈ ఫోన్ మన బ్రాండ్ ఆవిష్కరణకు నిదర్శనం. రోజువారీ పని, వినోదానికి అనువైన శక్తివంతమైన డివైజ్‌ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. 5G మద్దతుతో పాటు, ఏఐ ఫీచర్లు, ధృడ నిర్మాణం వినియోగదారులకు కీలక ప్రయోజనాలుగా ఉంటాయని తెలిపారు.