
Russia Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యాకు చెందిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాకు చెందిన లూనా-25 అంతరిక్ష నౌక చంద్రుడిపై కూలిపోయిందని రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, రోస్కోస్మోస్ తెలిపింది. ఈ మేరకు జర్మనీకి చెందిన డీడబ్ల్యూ న్యూస్ నివేదించింది.
గత 47సంవత్సరాల్లో చంద్రుడిపై రష్యా ప్రయోగించిన మొదటి మిషన్ ఇది.
స్పేస్‌క్రాఫ్ట్‌ను శనివారం ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి రోస్కోస్మోస్ ప్రవేశపెట్టింది. ఆ సమయంలో సమస్య ఏర్పడగా, అది జరిగిన కొద్దిసేపటికే స్పేస్ క్రాఫ్ట్‌తో సంబంధాలు తెగిపోయాయని స్పేస్ కార్పొరేషన్ వెల్లడించింది.
ఆగష్టు 14, 1976న అంతరిక్షంలోకి బయలుదేరిన లూనా 24 స్పేస్ క్రాఫ్ట్ చివరి రష్యా చంద్ర మిషన్. డిసెంబరు 1991లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యింది.
దీంతో రష్యా స్వతంత్ర దేశంగా అవతరించినందున తర్వాత తొలి మిషన్ ఇదే కావడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్యా ప్రయోగం విఫలం
Russia's Luna-25 spacecraft has crashed into the moon, reports Germany's DW News citing space corporation Roskosmos pic.twitter.com/ZtxYkFHUp2
— ANI (@ANI) August 20, 2023