శాంసంగ్ F54 5G వచ్చేసింది.. కెమెరాను చూస్తే మతిపోవాల్సిందే!
భారత మార్కెట్లోకి జూన్ 6న శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ కీలక ఫీచర్లను కంపెనీ రివీవ్ చేసింది. కస్టమర్లు రూ.999 చెల్లించి ఈ డివైజ్ ను ముందుగా బుక్ చేసుకోవచ్చు. అనంతరం ఫ్రీ ఆర్డర్ సమయంలో 2వేల వరకూ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అదే విధంగా న్యూ గెలాక్సీ ఎఫ్ 54 యూజర్లకు అద్భుతమైన కెమెరా ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని శాంసంగ్ వెల్లడించింది. ముఖ్యంగా లేటెస్ట్ స్టార్ట్ పోన్ ఓఐఎస్ సపోర్టులో 108 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. అదే విధంగా సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు ఆగకుండా షూట్ చేసుకొనే అవకాశం ఉంది.
శాంసంగ్ ఎఫ్54 5జీ ఫీచర్స్ ఇవే
ఈ కెమెరాతో రాత్రి ఆకాశంలో నక్షత్ర రాశులను స్పష్టంగా చూడొచ్చు. సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్‌లలో ఐకానిక్ నో షేక్ కామ్ కూడా ఈ మోడల్ ఫోన్ అప్ గ్రేడ్ కావడం విశేషం. నో షేక్ క్యామ్, 4k వీడియో సామర్థ్యాలతో స్పష్టంగా వీడియోలను తీయోచ్చు. సింగిల్ షాట్ తో నాలుగు వీడియోలు, నాలుగు ఫోటోల వరకూ క్యాప్చర్ చేసే వెసులుబాటుతో ముందుకు రానుంది. 25 డబ్య్లూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్టుతో 6000 ఎం ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుందిన టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫ్రంట్ కెమెరాతో తక్కువ లైటింగ్ కండిషన్స్ లోనూ మెరుగైన సెల్ఫీలు తీసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.