
Samsung Galaxy F36: అద్భుత ఫీచర్లతో శాంసంగ్ Galaxy F36 5G భారత మార్కెట్‌లోకి.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మొబైల్ దిగ్గజం శాంసంగ్ తాజాగా తన నూతన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ 'Galaxy F36 5G'ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ డివైస్ మెరుగైన ప్రాసెసర్, ప్రీమియం డిస్‌ప్లే, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో వినియోగదారులకు ఆకర్షణీయంగా మారింది. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు మరీదృష్టిదాకా తీసుకెళ్తున్నాయి. డిస్ప్లే & డిజైన్ Galaxy F36 5Gలో 6.7 అంగుళాల FHD+ 120Hz Super AMOLED Infinity-U డిస్‌ప్లే ఉంది. ముందుభాగానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+, వెనుక భాగానికి వేగన్ లెదర్ ఫినిష్ అందింది. ఈ ఫోన్ మందం 7.7mm మాత్రమే కాగా, బరువు కేవలం 197 గ్రాములు మాత్రమే
Details
ప్రాసెసర్ & OS
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5nm Exynos 1380 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. 6GB/8GB RAM వేరియంట్లు, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. 2TB వరకు స్టోరేజ్ విస్తరించే అవకాశం ఉంది. ఇది Android 15, One UI 7పై రన్ అవుతుంది. శాంసంగ్ 6 ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ హామీ ఇచ్చింది. కెమెరా ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా (OIS తో), 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరాను అందించింది, ఇది కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.
Details
బ్యాటరీ & కనెక్టివిటీ
ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే ఛార్జర్ బాక్స్‌లో ఇవ్వడం లేదు. కనెక్టివిటీకి 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 5, Bluetooth 5.3, GPS, USB Type-C లభ్యమవుతున్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ధర ఎంతంటే 6GB + 128GB వేరియంట్ ధర: రూ.17,499 8GB + 128GB వేరియంట్ ధర: రూ.18,999 లాంచ్ ఆఫర్ ధరలు : రూ. 15,999 నుంచి రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (బ్యాంక్ కార్డులపై) రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఈ ఫోన్ జూలై 29 నుంచి ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో లభించనుంది.