Page Loader
Samsung India:శాంసంగ్‌ ఇండియా కీలక నిర్ణయం.. ఆ ఫోన్‌లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్..  
శాంసంగ్‌ ఇండియా కీలక నిర్ణయం.. ఆ ఫోన్‌లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్..

Samsung India:శాంసంగ్‌ ఇండియా కీలక నిర్ణయం.. ఆ ఫోన్‌లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్..  

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 15, 2024
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

శాంసంగ్‌ ఇండియా (Samsung India) గ్రీన్‌ లైన్‌ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లకు మళ్లీ శుభవార్త అందించింది. వారి మొబైల్‌ స్క్రీన్‌లో గ్రీన్‌ లైన్‌ సమస్య ఉన్న వారికీ ఉచితంగా అందించే స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ గడువును పొడిగిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో ప్రకటించింది. ఇటీవల,శాంసంగ్‌ యూజర్లు గెలాక్సీ ఎస్‌21 (Galaxy S21) సిరీస్‌, గెలాక్సీ ఎస్‌21 ఎఫ్‌ఈ (Galaxy S21 FE 5G), గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా (Galaxy S22 Ultra) వంటి మోడళ్లలో గ్రీన్‌ లైన్‌ ఇష్యూ ఎదుర్కొన్నారు. మొబైల్ స్క్రీన్‌పై ఆకుపచ్చ రంగు గీత కనిపిస్తోందని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.ఈ సమస్యను పరిష్కరించడానికి వారు సామాజిక మాధ్యమాలలో తమ సమస్యను తెలపడంతో పాటు, సమాధానం లేదా పరిష్కారం అందించాలని కోరుతున్నారు.

వివరాలు 

ఇటువంటి సమస్యనే ఎదురుకొన్న వన్‌ప్లస్‌ (OnePlus) కంపెనీ

దీంతో, శాంసంగ్‌ ఇండియా యూజర్లకు ఒకసారి ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ అందించాలని నిర్ణయించింది. ఈ సేవ కోసం మొదట గడువు 30 సెప్టెంబర్‌ 2024 వరకు నిర్ణయించబడింది. అయితే, తాజాగా ఈ గడువును డిసెంబర్‌ 31, 2024 వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ సేవను పొందేందుకు, శాంసంగ్‌ యూజర్లు తమ దగ్గరలో ఉన్న శాంసంగ్‌ సర్వీస్‌ సెంటర్‌కి వెళ్లి ఈ సేవను పొందవచ్చు. ఇదే రకమైన సమస్యను వన్‌ప్లస్‌ (OnePlus) కంపెనీ కూడా గతంలో ఎదుర్కొని, ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.