
Samsung Unpacked 2025: శాంసంగ్ జడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) 2025 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 పేర్లతో రెండు ఫోల్డబుల్ ఫోన్లను అధికారికంగా ప్రకటించింది. ఇదే ఈవెంట్‌లో గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 FE మోడల్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. గత సంవత్సరం వచ్చిన జడ్ ఫోల్డ్ 6, జడ్ ఫ్లిప్ 6 కు కొనసాగింపుగా ఇవి పరిచయం చేశారు. ఈసారి ఫోన్లను మరింత స్లిమ్ డిజైన్‌తో, ఆకర్షణీయంగా రూపొందించటం విశేషం. కానీ మార్కెట్లో అందుబాటుకు సంబంధించిన సమాచారం ఇంకా వెల్లడించాల్సి ఉంది.
వివరాలు
Samsung Galaxy Z Fold 7 ముఖ్యాంశాలు
ఇన్నర్ డిస్‌ప్లే: 8 అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే. రిఫ్రెష్ రేట్: 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో. కవర్ స్క్రీన్: 6.5 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో. కవర్ డిస్‌ప్లే: కవర్ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2, వెనుక భాగానికి కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్. ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 16 ఆధారిత OneUI 8. ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్. AI ఫీచర్లు: జెమినీ లైవ్, AI రిజల్ట్ వ్యూ, సర్కిల్ టు సెర్చ్, డ్రాయింగ్ అసిస్టు, రైటింగ్ అసిస్టు.
వివరాలు
Samsung Galaxy Z Fold 7 ముఖ్యాంశాలు
కెమెరా సెటప్: వెనుక: 200MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో. ముందు (కవర్): 10MP సెల్ఫీ కెమెరా. లోపల: మరో 10MP సెల్ఫీ కెమెరా. స్టోరేజ్ వేరియంట్లు: 256GB, 512GB, 1TB. RAM: 12GB / 16GB. బ్యాటరీ: 4,400mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో. డిజైన్ & బరువు: అన్‌ఫోల్డ్ చేసినప్పుడు మందం: 4.2 మిల్లీమీటర్లు., ఫోల్డ్ చేసినప్పుడు: 8.9 మిల్లీమీటర్లు. బరువు: 215 గ్రాములు. రంగులు: బ్లూ షాడో, జెట్ బ్లాక్, సిల్వర్ షాడో. ధరలు: 12GB + 256GB: ₹1,74,999, 12GB + 512GB: ₹1,86,999, 16GB + 1TB: ₹2,10,999
వివరాలు
Samsung Galaxy Z Flip 7 ముఖ్య ఫీచర్లు
డిస్‌ప్లే: మెయిన్: 6.9 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోలెడ్ 2X ఫోల్డబుల్ స్క్రీన్. కవర్ స్క్రీన్: 4.1 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే. రిఫ్రెష్ రేట్: రెండు స్క్రీన్లు కూడా 120Hz సపోర్ట్‌తో. ప్రొటెక్షన్: కవర్ స్క్రీన్‌కి కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 గ్లాస్. ప్రాసెసర్: శాంసంగ్ ఎగ్జినోస్ 2500. ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 16, OneUI 8. కెమెరా సెటప్: వెనుక: 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్. ముందు: 10MP సెల్ఫీ కెమెరా. AI టూల్స్: ఇమేజ్ ఎడిటింగ్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్టు, నోట్ అసిస్టు, కాల్ అసిస్టు, లైవ్ ట్రాన్స్‌లేషన్. బ్యాటరీ: 4,300mAh. డిజైన్: ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్.
వివరాలు
Samsung Galaxy Z Flip 7 ముఖ్య ఫీచర్లు
రంగులు: బ్లూ షాడో, కోరల్ రెడ్, జెట్ బ్లాక్, మింట్. ధరలు: 12GB + 256GB: ₹1,09,999, 12GB + 512GB: ₹1,21,999
వివరాలు
Samsung Galaxy Z Flip 7 FE (ఫ్యాన్ ఎడిషన్) ఫీచర్లు
డిస్‌ప్లే: మెయిన్ స్క్రీన్: 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X. కవర్ డిస్‌ప్లే: 3.4 అంగుళాల సూపర్ అమోలెడ్. ప్రాసెసర్: ఎగ్జినోస్ 2400 చిప్‌సెట్. కెమెరా సెటప్: వెనుక: 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా. ముందు: 10MP సెల్ఫీ కెమెరా. బ్యాటరీ: 4,500mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ధరలు: ఇంకా ప్రకటించాల్సి ఉంది.