LOADING...
Apple: ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో 'సంచార్ సౌథీ'.. నో చెప్పిన ఆపిల్? 
ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో 'సంచార్ సౌథీ'.. నో చెప్పిన ఆపిల్?

Apple: ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో 'సంచార్ సౌథీ'.. నో చెప్పిన ఆపిల్? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వ తాజా ఆదేశాలపై టెక్ దిగ్గజం ఆపిల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్‌ సేఫ్టీ యాప్ 'సంచార్ సాథీ'ని ప్రీలోడ్ చేయాలన్న కేంద్ర ఆదేశానికి ఆపిల్ సరేనని చెప్పేందుకు సిద్ధంగా లేదని మూడు వేర్వేరు వర్గాలు రాయిటర్స్‌కు వెల్లడించాయి. 90 రోజుల్లోగా ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో పాటు, దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసే అవకాశం వినియోగదారులకు ఇవ్వొద్దని ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సరఫరా గొలుసులో ఉన్న పరికరాలకు కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాప్‌ను పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది. టెలికం మంత్రిత్వ శాఖ మాత్రం ఇది దేశ సైబర్ భద్రతకు సంబంధించిన కీలక చర్య అని స్పష్టం చేసింది.

Details

సెక్యూరిటీకి విఘాతం కలిగించే అవకాశం

అయితే ఈ ఆదేశం దేశంలోని 73 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ప్రైవసీని దెబ్బతీయొచ్చని ప్రతిపక్ష నాయకులు, ప్రైవసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ మాత్రం ఎక్కడైనా ఈ తరహా ఆదేశాలను పాటించబోదని, ఇవి తమ iOS వ్యవస్థలో ప్రైవసీ, సెక్యూరిటీకి విఘాతం కలిగిస్తాయని కేంద్రానికి తెలియజేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆపిల్ ఇండియాలో $38 బిలియన్ల వరకు జరిమానా విధించే అవకాశమున్న యాంటీట్రస్ట్ కేసును కూడా ఎదుర్కొంటోంది. సామ్సంగ్ సహా ఇతర ఫోన్ తయారీదారులు ఆదేశాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ముందస్తు చర్చలు లేకుండానే ఈ ఆదేశం వచ్చిందని పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

Details

ఫోన్ లో ఉంచాలా వద్దా అనేది వినియోగదారుల లక్ష్యం

ఇక ఆదేశంపై దేశవ్యాప్తంగా రాజకీయ వాదోపవాదాలు మొదలయ్యాయి. పార్లమెంటులో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఇది స్నూపింగ్ టూల్‌లా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో యాప్ తప్పనిసరి కాదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టంచేశారు. మీకు సంచార్ సాథీ అవసరం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఐచ్చికమని ఆయన చెప్పారు. దేశ ప్రజలందరికీ ఈ యాప్ గురించి తెలియజేయడం మా బాధ్యత. ఫోన్‌లో ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారు నిర్ణయమని తెలిపారు. ప్రస్తుతం మొబైల్ దోపిడీలు, నకిలీ IMEI నంబర్లు, సెకండ్హ్యాండ్ ఫోన్ల అక్రమ విక్రయాలను అరికట్టడంలో సంచార్ సాథీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

Advertisement