మేఘాలయలోని సిజు గుహలో కొత్తజాతి కప్పలను కనుగొన్న శాస్త్రవేత్తలు
జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ZSI) శాస్రవేత్తలు కొత్తజాతి కప్పలను కనుగొన్నారు. ఇండియాలోని ఒక గుహ నుండి ఇటువంటి కప్పలను కనుక్కోవడం ఇది రెండోసారి. 2014లో తమిళనాడులోని ఓ గుహలో ఇటువంటి కప్పలను కనుక్కొనగా.. ప్రస్తుతం మేఘాలయకు చెందిన సౌత్ గారో హిల్స్ జిల్లాలోని ఒక గుహ లోపల కొత్త జాతి కప్పలను కనుకున్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం, పూణేకి చెందిన ZSI పరిశోధకులు ఓ గుహలో క్యాస్కేడ్ రానిడ్ కప్పల కొత్త జాతిని కనుకొన్నట్లు పరిశోధకులలో ఒకరైన భాస్కర్ తెలిపారు. ఈ కొత్తజాతి కప్పలకు అమోలోప్స్ సిజు అనే పేరు పెట్టారన్నారు.
గతంలో కొత్తజాతి కప్పలపై అన్వేషణ
పరిశోధకుల బృందంలో పూణేలోని ZSIకి చెందిన డాక్టర్ కేపీ దినేష్, షబ్నమ్ అన్సారీతో పాటు ZSI కార్యాలయం నుండి సైకియా, డాక్టర్ బిక్రమ్‌జిత్ సిన్హా కూడా ఉన్నారు ఈ బృందం అరుణాచల్ ప్రదేశ్‌లో మరో మూడు కొత్త జాతుల క్యాస్కేడ్ కప్పలను గతంలో కనుక్కొంది. వాటిలో అమోలోప్స్ చాణక్య, అమోలోప్స్ టెర్రార్చిస్, అమోలోప్స్ తవాంగ్ ఉన్నాయి ఈశాన్య భారతదేశంలోని ఉభయచర జంతుజాలం పూర్తిగా అన్వేషించలేదని, ఈ 'బయోజియోగ్రాఫికల్ ఫానా రిచ్' హాట్‌స్పాట్ నుండి మరిన్ని కొత్త జాతులను కనుగొనే అవకాశం ఉందని డాక్టర్ దినేష్ చెప్పారు