LOADING...
world's rarest blood group: ప్రపంచంలో అరుదైన బ్లడ్ గ్రూప్ గుర్తింపు.. ముగ్గురిలో మాత్రమే B(A) టైప్‌!
ముగ్గురిలో మాత్రమే B(A) టైప్‌!

world's rarest blood group: ప్రపంచంలో అరుదైన బ్లడ్ గ్రూప్ గుర్తింపు.. ముగ్గురిలో మాత్రమే B(A) టైప్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు బ్లడ్ గ్రూప్‌లపై చేసిన పరిశోధనల్లో మరో అరుదైన విషయం బయటపెట్టారు. ఇప్పటివరకు సాధారణంగా తెలిసిన A, B, O, AB బ్లడ్ గ్రూప్‌లు, అలాగే పాజిటివ్‌, నెగటివ్‌గా గుర్తించే Rh ఫ్యాక్టర్‌కు మించి కొత్త రక్తరకం ఉన్నట్టు వెల్లడించారు. మొత్తం 5.44 లక్షలకుపైగా రక్త నమూనాలు పరీక్షించగా, ప్రపంచవ్యాప్తంగా కేవలం ముగ్గురిలో మాత్రమే "హైబ్రిడ్‌ B(A)" అనే అత్యంత అరుదైన రక్తగ్రూప్‌ ఉందని గుర్తించారు. ఇందులో ఒకరు రోగి కాగా, మరో ఇద్దరు రక్తదాతలు. ఇది సుమారు ప్రతి లక్ష మందిలో కేవలం 0.00055 శాతంలో మాత్రమే కనిపించే జన్యుమార్పుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాలు 

బ్లడ్ గ్రూప్ ఎలా నిర్ణయిస్తారు?

మన శరీరంలో ఉన్న యాంటీజెన్లు (ప్రోటీన్లు, షుగర్లు, లిపిడ్లు) ఆధారంగా బ్లడ్ గ్రూప్ ను నిర్ణయిస్తారు. శరీరానికి బాహ్య పదార్థం వచ్చినప్పుడు ప్రతిస్పందన కలిగించే వీటిలో A యాంటీజెన్‌కి ప్రత్యేకమైన షుగర్‌, B యాంటీజెన్‌కి D-గాలాక్టోజ్‌, ABలో ఈ రెండూ ఉంటాయి. O పాజిటివ్‌లో Rh ఫ్యాక్టర్‌ ఉండగా, O నెగటివ్‌లో వీటిలో ఏదీ ఉండదు. రక్తం ఎక్కించే సమయంలో దాతల యాంటీజెన్లు గ్రహీతల వాటితో సరిపోవాల్సిందే. అందుకే O నెగటివ్‌ను యూనివర్సల్‌ డోనర్‌గా పరిగణిస్తారు. ఈ మొత్తం సమాచారం తొమ్మిదో క్రోమోజోమ్‌లో ఉండే ABO జన్లో సంకేతీకృతమై ఉంటుంది.

వివరాలు 

B(A) బ్లడ్ గ్రూప్ అంటే ఏమిటి?

B(A) బ్లడ్ గ్రూప్ అనేది ABO జన్లో వచ్చిన అరుదైన జన్యుమార్పు ఫలితం. ఈ ముగ్గురిలో శాస్త్రవేత్తలు ABO జన్లో నాలుగు రకాల వేరియేషన్లు గుర్తించారు. ఇవి ఎర్ర రక్త కణాల్లో యాంటీజెన్ల నిర్మాణానికి కారణమయ్యే ఎంజైమ్‌ (గ్లైకోసైల్‌ట్రాన్స్‌ఫరేజ్‌) పనితీరును మార్చేస్తాయి. ఫలితంగా వారి రక్తం ప్రధానంగా B రక్తగ్రూప్‌లా కనిపించినప్పటికీ, చాలా స్వల్పంగా A యాంటీజెన్‌ లక్షణాలనూ చూపిస్తుంది. అందుకే ఇది సాధారణ A, B, AB లేదా O రక్తగ్రూప్‌లకు మార్చి ఉపయోగించడానికి సరిపోదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

ఇతర అరుదైన బ్లడ్ గ్రూప్ లు

ప్రపంచ జనాభాలో కేవలం 7 శాతం మందిలో మాత్రమే O నెగటివ్‌ రక్తగ్రూప్‌ కనిపిస్తుంది. అంతేకాదు, పూర్తిగా Rh యాంటీజెన్‌ లేని Rh నెగటివ్‌ రక్తగ్రూప్‌ కలిగిన వారు ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మంది మాత్రమే ఉన్నారని అంచనా. 2025లో బెంగళూరు సమీపంలోని కోలార్‌కు చెందిన 38 ఏళ్ల మహిళలో "CRIB" అనే మరో అరుదైన రక్తగ్రూప్‌ను గుర్తించారు. అదే ఏడాది యూరప్‌కు చెందిన ఒక వ్యక్తిలో "గ్వాడా-నెగటివ్‌" బ్లడ్ గ్రూప్‌ బయటపడింది. ఇది ఎంతో ప్రత్యేకమైనది కావడంతో, దీనికి సరిపోలే దాతలు ప్రస్తుతం ఎవరూ లేరని పరిశోధకులు తెలిపారు.

Advertisement