Mosquitoes: "టాక్సిక్" వీర్యంతో దోమలను పెంచాలనుకుంటున్న శాస్త్రవేత్తలు .. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇళ్లలో,పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వడం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు పెరిగి, అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.
కొన్నిసార్లు ఈ వ్యాధులు ప్రాణాంతకంగా మారుతాయి. ముఖ్యంగా, ఆడ దోమల వల్ల వ్యాధులు విస్తరించడాన్ని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలతో ముందుకు వచ్చారు.
ఉష్ణమండల ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణ కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు విభిన్న పద్ధతులను పరిశీలిస్తున్నారు.
వారు మనుషులను కుట్టే ఆడ దోమలతో సంభోగం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని పరిశోధిస్తున్నారు.
ఈ విధానంతో, పురుగుమందుల వాడకంతో ఇతర ప్రయోజనకర జీవజాతులకు హానిచేకూరకుండా, దోమల నియంత్రణ సాధ్యమవుతుందని వారు తెలిపారు.
వివరాలు
ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గుదల
ఈ ప్రయోగాన్ని ఈగలపై నిర్వహించినప్పుడు, ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గినట్లు వారు గమనించారు.
అయితే, ఈ విధానం మనుషులకు, ఇతర జీవజాతులకు ఎలాంటి హాని కలిగించదని పూర్తిగా నిర్ధారించిన తర్వాత మాత్రమే, ఈ ప్రయోగాన్ని విస్తృతంగా అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు.