LOADING...
NASA's Artemis II Mission: మీ పేరును నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో స్పేస్‌కి పంపండి: ఎలా అప్లై చేయాలంటే?
ఎలా అప్లై చేయాలంటే?

NASA's Artemis II Mission: మీ పేరును నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో స్పేస్‌కి పంపండి: ఎలా అప్లై చేయాలంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ కొత్త అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పేరును పంపేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తోంది. 'Send Your Name with Artemis II'అనే క్యాంపెయిన్‌ ద్వారా,ఎవ్వరైనా తమ పేరును ఆర్టెమిస్ II మిషన్‌లో ప్రయాణించబోయే ఓరియాన్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ మిషన్‌లో నాలుగు ఆస్ట్రోనాట్స్ చందమామ చుట్టూ తిరిగి భూమికి సురక్షితంగా వస్తూ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వయసు, జాతి, దేశం ఎలాంటి పరిమితులు లేవు. ప్రతి ఒక్కరు ఈ మిషన్‌లో భాగంగా అవ్వచ్చు. పేర్లు నమోదు చేసిన వారు ఆ పేర్లు ఒక మెమొరీ కార్డులో పెట్టి,ఆ కార్డ్‌ను ఆర్టెమిస్ II స్పేస్‌షిప్‌లో ప్రయాణానికి ముందే ఉంచతారు.

వివరాలు 

ఆర్టెమిస్ II మిషన్ వివరాలు

అలాగే, వారి పేరుతో ఒక ప్రత్యేక డిజిటల్ బోర్డింగ్ పాస్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్టెమిస్ II నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో మొదటి క్రూడ్డ్ ఫ్లైట్‌గా నిలుస్తుంది. ఇది గత 50 ఏళ్లలో భూమి నుంచి మానవుడు ఎప్పుడూ వెళ్ళని దూరానికి ప్రయాణించబోయే మిషన్. ఈ 10 రోజుల టెస్ట్ ఫ్లైట్ 2026 ఏప్రిల్‌ నాటికి ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమవుతుంది. మిషన్‌లో ఓరియాన్ స్పేస్‌ క్రాఫ్ట్ సుమారు 7,400 కి.మీ.చందమామ ఉపరితలంపై ప్రయాణించి, అనంతరం భద్రంగా భూమికి తిరిగి వస్తుంది. నాసా ప్రకటన ప్రకారం,"ఈ మిషన్ కేవలం సిస్టమ్స్ పరీక్షించటం,భవిష్యత్ ల్యాండింగ్స్‌కి సన్నాహకంగా కాకుండా,మానవజాతి చందమామ పునఃయాత్రలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యం."

వివరాలు 

ఎలా పాల్గొనాలి?

ఈ క్యాంపెయిన్‌లో చేరడం చాలా సులభం, అలాగే పూర్తి ఉచితం కూడా . ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు క్రింది నాసా అధికారిక లింక్ ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చు: ఇంగ్లీష్ బోర్డింగ్ పాస్ కోసం - https://go.nasa.gov/artemisnames స్పానిష్ బోర్డింగ్ పాస్ కోసం - https://go.nasa.gov/TuNombreArtemis పేరు నమోదు చేసిన వెంటనే డిజిటల్ బోర్డింగ్ పాస్ పొందొచ్చు. పిల్లలు, స్నేహితులు, పెంపుడు జంతువుల పేర్లను కూడా నమోదు చేయవచ్చు. ఇది అంతరిక్ష చరిత్రలో భాగం కావడానికి సరదా అవకాశం. దరఖాస్తు చివరి తేదీ - 21 జనవరి, 2026.

వివరాలు 

ఆర్టెమిస్ II మిషన్ టీం

ఈ మిషన్‌ను నిర్వహించబోతున్న ఆస్ట్రోనాట్స్‌ వీరే : రీడ్ విస్మాన్ - మిషన్ కమాండర్ (NASA) విక్టర్ గ్లోవర్ - పైలట్ (NASA) క్రిస్టినా కోక్ - మిషన్ స్పెషలిస్ట్ (NASA) జెరమీ హాన్సెన్ - మిషన్ స్పెషలిస్ట్ (కెనడియన్ స్పేస్ ఏజెన్సీ) ఈ టీం ఓరియాన్ స్పేస్‌ క్రాఫ్ట్ జీవన మద్దతు వ్యవస్థలు, నావిగేషన్, కమ్యూనికేషన్ సాంకేతికతలని పరీక్షించి, భవిష్యత్ చంద్ర ఉపరితల మిషన్లకు, చివరికి మంగళ ప్రయాణానికి సన్నాహకంగా పని చేస్తారు.

వివరాలు 

నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌ లక్ష్యం

1972లో చివరి అపోలో మిషన్ తర్వాత ఈ ఆర్టెమిస్ II మిషన్ మానవ అంతరిక్ష అన్వేషణలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ఆస్ట్రోనాట్లను చంద్రుడికి పంపడం, అక్కడ స్థిరంగా ఉండే ఏర్పాట్లు చేయడం, తర్వాత మంగళానికి మానవులు వెళ్లడానికి సిద్ధం కావడం.. నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌ లక్ష్యం